న్యూజిలాండ్‌తో తలపడనున్న టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమ్ఇండియాకు సూచించాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్. అశ్విన్, జడేజా అందుకు సరైన ఎంపిక అని ఆయన అభిప్రాయపడ్డాడు. వీరిద్దరూ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగలరని చెప్పాడు.
టీమ్ఇండియాకు స్పిన్నర్లుగా జడేజా, అశ్విన్లైతే మేలని నేను భావిస్తాను. వీరిద్దరూ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించగలరు. బౌలింగ్ లైనప్‌లో ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఎంపిక చేసుకుంటే సమతూకం అవుతుందని భావిస్తున్నా. పేసర్ బుమ్రా నైపుణ్యం అత్యద్భుతం. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన సిరీస్‌లో సిరాజ్ కూడా మంచి ప్రదర్శనను కనబరిచాడు.
-ఇయాన్ బిషప్, వెస్టిండీస్ మాజీ క్రికెటర్
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అశ్విన్(Ravichandran Aswin) నిలిచాడు. 13 మ్యాచుల్లో 67 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా జడేజా(Jadeja) 10 మ్యాచుల్లో 28 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటుతోనూ అద్బుతమైన ప్రదర్శన చేశాడు.
జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్నాయి. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గెలుపొందిన కివీస్ జట్టు.. ఇప్పుడు టీమ్ఇండియాతో తలపడేందుకు సిద్ధంగా ఉంది.
ఇదీ చదవండి:'సౌథాంప్టన్ పిచ్ స్పిన్‌కే అనుకూలం'