టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్పగానే ఎవరికైనా ఏం గుర్తుకు వస్తుంది. అతడి ధనాధన్ బ్యాటింగ్, మైదానంలో కూల్ కెప్టెన్సీ, వికెట్ల వెనక చురుకైన కీపింగ్.. చెప్పుకొంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలా క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన మహీ.. కుటుంబానికీ చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. సామాజిక మాధ్యమాల్లో ధోనీ దంపతులు షేర్ చేసిన ఫొటోలే ఇందుకు నిదర్శనం. అవేంటో మీరూ చూడండి.
ఆ ముగ్గురు..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
తల్లి, తండ్రి, కూతురు మధ్య బంధమనేది చాలా ప్రత్యేకమైంది. ధోనీతో తన కూతురు జీవా, సాక్షి ఉన్న ఓ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసింది సాక్షి. ఇది వారి 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
టీజ్ చేస్తూ..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
అదే పోస్ట్‌లో మరో ఫొటోను సాక్షి షేర్ చేసింది. ఇందులో మహీని ఆటపట్టిస్తూ కనిపించింది సాక్షి. ఈ చిత్రం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకు నిదర్శనంగా ఉంది.
జంటగా..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
జంటగా ఉండటమంటే జీవితంలో ఎదురయ్యే ఒడుదొడుకులను కలిసి ఎదుర్కోవడం. ఆటగాడిగా తన కుటుంబంతో తగిన సమయం గడపని మహీ.. రిటైర్మెంట్ అనంతరం భార్య, కూతురుతో విలువైన సమయాన్ని కేటాయిస్తున్నాడు. వీరిద్దరూ జంటగా దిగిన ఓ చిత్రం వారి అనుబంధానికి గుర్తుగా నిలుస్తోంది.
ప్రేమ నుంచి పెళ్లి వరకు..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
పెళ్లి కానంత వరకు కూడా ధోనీ-సాక్షి జంట మధ్య ప్రేమాయణం సాగిందని చాలా మందికి తెలియదు. అందుకే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యాక అభిమానులు ఆశ్చర్యపోయారు. జులై 4తో వీరి అనుబంధానికి 12 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఇప్పటికే భర్తగా, తండ్రిగా.. తానెంటో నిరూపించుకున్నాడు మహీ. ఈ జోడీ ప్రేమాయణం సాగించిన రోజుల నుంచి మొన్నటి షిమ్లా టూర్ వరకు దిగిన ఫొటోలు మీ కోసం.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కలిసికట్టుగా..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఎంఎస్ ధోనీకి బైక్‌లన్నా, జీప్లన్నా చాలా ఇష్టం. మార్కెట్లో అతడికి నచ్చిన ప్రతి కారు, బైక్ తన గ్యారేజీలో దర్శనమిస్తాయి. వాటిల్లో ఒక దానిని మహీ శుభ్రం చేస్తుండగా.. తన కూతురు జీవా అతడికి సహాయం చేస్తోంది.
టీచర్‌గా..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
క్రికెటర్‌గా యువ ఆటగాళ్లకు విలువైన సలహాలు, సూచనలిచ్చిన ధోనీ.. తన కూతురుకు కూడా పలు భారతీయ భాషల గురించి చెప్తున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇది.
సీఎస్కేతో..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
రెండేళ్ల నిషేధం అనంతరం తిరిగి ఐపీఎల్లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. 2018లో టైటిల్ విజేతగా నిలిచింది. ఆ సందర్భంగా మహీ కుటుంబంతో దిగిన ఓ ఫొటో.
హెయిర్ డ్రై చేస్తూ..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ వీడియోలో ధోనీ తన గారలపట్టి జీవా జుట్టు ఆరబెడుతున్నాడు. తన నాన్న చేస్తున్న పనికి జీవా కూడా చక్కగా సహకరిస్తోంది.
భూమిపై పాకుతూ..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
వికెట్ల మధ్య చురుకుగా పరుగెత్తే మహీ.. భూమిపై పాకుతున్న వీడియో ఇది. చిన్నారిగా జీవా చేస్తున్న పనిని ధోనీ కూడా చేసి చూపించాడు.
ఇదీ చదవండి: ఇద్దరు యూఏఈ ఆటగాళ్లపై ఐసీసీ నిషేధం