ETV Bharat / sports

టీమ్ఇండియాకు ఒక్క మ్యాచ్ ఆడారు.. కనుమరుగయ్యారు! - Faiz Fazal

క్రికెట్​లో రాణించాలని ఎంతోమంది యువత కలలు కంటున్నారు. టీమ్ఇండియా తరఫున ఒక్క మ్యాచ్​లోనైనా ఆడాలని.. తమ అదృష్టాన్ని పరిక్షించుకోవాలని అనేకమంది క్రికెటర్లు భావిస్తున్నారు. అయితే ఇంతటి క్రేజ్​ ఉన్న క్రికెట్​లో భారత్​ జట్టుకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్​లో ప్రాతినిధ్యం వహించి.. ఆ తర్వాత ఆటలో కనిపించకుండా పోయిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఆ క్రికెటర్లు ఎవరు? ఏఏ మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించారో తెలుసుకుందాం.

10 Indian cricketers who played just one game and faded away
భారత్​ తరఫున ఒకే ఒక్క మ్యాచ్​- ఆ ఆటగాళ్లెవరో తెలుసా?
author img

By

Published : Aug 11, 2021, 9:09 AM IST

భారతదేశంలో క్రికెట్​కు ఎనలేని ఆదరణ ఉంది. కోట్ల మంది ప్రేమించే ఈ క్రీడలో అరంగేట్రం చేయాలని ఎంతోమంది యువత కలలు కంటారు. అయితే క్రికెట్​లో రాణించాలంటే కృషి, పట్టుదలతో పాటు భారత్​కు ఆడాలంటే కొంత అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే ఇతర దేశాలతో పోలిస్తే క్రికెట్​లో టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమనేది చాలా గొప్ప. ఆ లక్ష్యంతో ఎంతోమంది క్రికెటర్లు భారత జట్టులో ఓ వెలుగు వెలుగగా.. మరికొంత మంది పరిమిత మ్యాచ్​లు ఆడి సరిపెట్టుకున్నారు. అయితే భారత జట్టు తరఫున కేవలం ఒకే ఒక్క మ్యాచ్​తోనే కనిపించకుండా పోయినా క్రీడాకారులూ ఉన్నారు. అలా ఒకే ఒక్క మ్యాచ్​ ఆడిన క్రికెటర్లు ఎవరో ఈ సందర్భంగా తెలుసుకుందాం.

1) ఫైజ్​ ఫజల్​

విదర్భ ఫస్ట్​క్లాస్​ జట్టుకు చెందిన ఫైజ్​ ఫజల్​.. 2016లో హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో అంతర్జాతీయ క్రికెట్​లోకి అరంగేట్రం చేశాడు. 30 ఏళ్ల వయసులో టీమ్ఇండియాకు సెలెక్ట్ అయిన తొలి ఆటగాడు​ ఇతడే కావడం విశేషం. అదే అతడికి చివరి మ్యాచ్ కూడా. ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో 2003లో అరంగేట్రం చేసి.. 125 మ్యాచ్​లలో 8,404 పరుగులు నమోదు చేశాడు. అత్యధికంగా 127 పరుగులు నమోదు చేశాడు.

2) విజయ్​ రాజేందర్​నాథ్​

పంజాబ్​లోని అమృతసర్​కు చెందిన విజయ్​ రాజేందర్​నాథ్​.. 1952-53లో టీమ్ఇండియా తరఫున వికెట్​ కీపర్​గా అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది పాకిస్థాన్​తో జరిగిన సిరీస్​లో సెలెక్టర్లు అవకాశం ఇచ్చిన నలుగురు వికెట్​ కీపర్లలో ఈయన ఒక్కడు. ముంబయి వేదికగా జరిగిన మూడో టెస్టులో నాలుగు స్టంపౌట్​లు చేశాడు.. కానీ బ్యాటింగ్​ చేసేందుకు అవకాశం రాలేదు. ఆ తర్వాత టీమ్ఇండియాలో అతడు కనిపించలేదు. వికెట్ కీపర్​గా విజయ్​ కెరీర్​లో ఒక్క క్యాచ్​ కూడా లేదు.

విజయ్​ రాజేందర్​నాథ్​.. రంజీల్లో బిహార్​ టీమ్​కు ప్రాతినిధ్యం వహించాడు. వికెట్​ కీపర్​గా తన కెరీర్​లో 844 రన్స్​, 34 క్యాచ్​లు, 23 స్టంపింగ్స్​ సాధించాడు.

3) ఇక్బాల్​ సిద్ధిఖీ

2001లో మొహలీ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో టీమ్​ఇండియా తరఫున ఇక్బాల్​ సిద్ధిఖీ అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్​లో అటు బౌలింగ్​తో పాటు బ్యాటింగ్​లోనూ మంచి ప్రదర్శన చేసి ఆల్​రౌండర్​గా పేరొందాడు. ఆ మ్యాచ్​లో 10వ స్థానంలో బ్యాటింగ్​కు దిగిన ఆయన 24 పరుగులు సాధించడం సహా ఓ వికెట్​ పడగొట్టాడు. ఈ మ్యాచ్​ తర్వాత అతడు టీమ్ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించలేదు.

ఇక్బాల్​ సిద్ధిఖీ.. 1993-94లో ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్​లో మొత్తంగా 90 మ్యాచ్​లు ఆడి 315 వికెట్లు పడగొట్టాడు.

4) మయాంక్​ మార్కండే

2019లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్​లో అరంగేట్రం చేసిన మయాంక్​ మార్కండే కూడా టీమ్ఇండియా తరఫున ఒకే మ్యాచ్​కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్​లో 31 పరుగులు నమోదు చేసి.. ఒక్క వికెట్​ కూడా సాధించలేదు.

10 Indian cricketers who played just one game and faded away
మయాంక్​ మార్కండే

అంతకుముందు ఐపీఎల్​-2018లో ముంబయి ఇండియన్స్​ జట్టుకు ఆడిన ఈ లెగ్​ స్పిన్నర్​.. 14 మ్యాచ్​ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. 2018-19 సీజన్లలో పంజాబ్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మయాంక్​.. 29 వికెట్లు సాధించాడు.

5) కెనియా జయంతిలాల్​

1971లో వెస్టిండీస్​తో జరిగిన 5 టెస్టుల సిరీస్​లో సునీల్​ గావస్కర్​.. 774 పరుగులు నమోదు చేశాడు. ఈ సిరీస్​లోని తొలి టెస్టుకు గావాస్కర్​కు గాయం కారణంగా విశ్రాంతి లభించడం వల్ల ఆ స్థానంలో రిజర్వ్​ బ్యాట్స్​మన్​ కెనియా జయంతిలాల్​ అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో కేవలం 5 రన్స్​ నమోదు చేశాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్​ ఆడే అవకాశం భారత్​కు రాలేదు. దీంతో జయంతిలాల్​.. భారత్​ తరఫున ఏకైక మ్యాచ్​ ఆడిన క్రికెటర్​గా నిలిచాడు.

కెనియా జయంతిలాల్​.. హైదరాబాద్​కు చెందిన రంజీ జట్టుకు 91 మ్యాచ్​ల్లో ప్రాతినిధ్యం వహించి.. 4,687 పరుగులు నమోదు చేశాడు.

6) బకా జిలానీ

1936లో ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టులో టీమ్ఇండియా తరఫున బకా జిలానీ అరంగేట్రం చేశాడు. ఆ సమయంలో టీమ్ఇండియా కెప్టెన్​ విజయనగరం మహారాజు, సీకే నాయుడు మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో నాయుడికి బదులుగా జిలానీకి ఆడే అవకాశం వచ్చింది. ఆ టెస్టులో ఆడిన రెండు ఇన్నింగ్స్​లో 4(నాటౌట్​), 12 పరుగులు చేసిన బకా జిలానీ.. అటు బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ ఆకట్టుకోలేకపోయాడు.

బకా జిలానీ

1934-35లో రంజీ ట్రోఫీ ఆరంభ టోర్నీలో హ్యాట్రిక్​ వికెట్లు తీసిన బౌలర్​గా బకా జిలానీ ఘనత సాధించాడు.

7) పంకజ్​ ధర్మాని

దేశవాళి క్రికెట్​లో పంజాబ్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పంకజ్​ ధర్మాని.. కెరీర్​లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా ఘనత సాధించాడు. 1996లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగిన ట్రై-సిరీస్​(టిటాన్​ కప్​)లో భారత్​ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఈ సిరీస్​లో జైపూర్​ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​లోనే ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్​లో కేవంల 8 పరుగులతో సరిపెట్టుకున్నాడు. అంతర్జాతీయ కెరీర్​లో పంకజ్​కు ఇదే ఏకైక మ్యాచ్​.

1999-2000 మధ్య ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో అరంగేట్రం చేసిన పంకజ్​ ధర్మని.. 13 మ్యాచ్​లు ఆడి.. 1194 పరుగులు నమోదు చేశాడు. ఐపీఎల్​ ఆరంభ టోర్నీలో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

8) శ్రీకాంత్​ అరవింద్​

దేశవాళి క్రికెట్​లో కర్ణాటకకు చెందిన శ్రీకాంత్​ అరవింద్​.. ఓ పవర్​హౌస్​ లాండివాడు. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్​లో అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్​లో 3.4 ఓవర్లకు బౌలింగ్​ చేసి 44 పరుగులు సమర్పించాడు. అయితే అంతకుముందు 2011లో ఇంగ్లాండ్​ పర్యటన కోసం ఈ క్రికెటర్​ను ఎంపిక చేసినా.. గాయం కారణంగా ఆడే అవకాశం లభించలేదు.

శ్రీకాంత్​ అరవింద్​

9) ఎమ్​జీ గోపాలన్​

1933-34లో జరిగిన ఇంగ్లాండ్​ పర్యటనలో మద్రాస్​కు చెందిన ఎమ్​జీ గోపాలన్​ అరంగేట్రం చేశాడు. కోల్​కతా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్​లో భారత్​ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్​లో 19 ఓవర్లు బౌలింగ్​ చేసిన గోపాలన్​.. ఇంగ్లాండ్​ స్టార్​ బ్యాట్స్​మన్​ వికెట్​ సాధించాడు.

1934 నవంబరులో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన గోపాలన్​.. 1950ల్లో సౌత్​ జోన్​ టెస్టు మ్యాచ్ సెలెక్టర్​గా ఎంపికయ్యాడు. తమిళనాడు, శ్రీలంక మధ్య నిర్వహించే గోపాలన్​ ట్రోఫీ.. ఈయన గౌరవార్థం పెట్టినదే!

10) సుడాంగ్సు అబినాష్ బెనర్జీ

టీమ్ఇండియా తరఫున ఏకైక టెస్టు క్రికెట్​ మ్యాచ్​ ఆడిన వారిలో సుడాంగ్సు అబినాష్​ బెనర్జీ ఒకరు. 1948 డిసెంబరులో వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో అంతర్జాతీయ క్రికెట్​లో అబినాష్​ బెనర్జీ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్​లో 5 వికెట్లు పడగొట్టడం సహా రెండు క్యాచ్​లు ఒడిసిపట్టాడు. తొలి ఇన్నింగ్స్​లో 120.. రెండో ఇన్నింగ్స్​లో 61 పరుగులు నమోదు చేశాడు.

అయితే ఈ మ్యాచ్​లో బెనర్జీ ఉత్తమ ప్రదర్శన చేసినా ఫలితం లేకుండా ఆట డ్రాగా ముగిసింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో ఆడిన బెనర్జీకి.. టీమ్ఇండియా సెలెక్టర్ల నుంచి ఎలాంటి పిలుపు రాలేదు.

ఇదీ చూడండి.. గుడ్​న్యూస్​.. ఒలింపిక్స్​లో క్రికెట్​కు అంతా సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.