ETV Bharat / sports

గెలుపుతో సింధు నిష్క్రమణ- ముగిసిన భారత్ కథ - బ్యాడ్మింటన్

వరల్డ్​ టూర్​ ఫైనల్స్ (డబ్ల్యూటీఎఫ్)​ టోర్నీని విజయంతో ముగించింది భారత బ్యాడ్మింటన్ స్టార్ సింధు. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో ప్రత్యర్థి చోచువాంగ్​ను వరుస సెట్లలో ఓడించింది. కాగా ఈ మ్యాచ్​తో డబ్ల్యూటీఎఫ్​లో భారత్ కథ ముగిసింది.

World Tour Finals: Sindhu finishes campaign with win over Pornpawee
గెలుపుతో నిష్క్రమించిన సింధు.. ముగిసిన భారత్ కథ
author img

By

Published : Jan 29, 2021, 4:48 PM IST

వరల్డ్​ టూర్​ ఫైనల్స్​ను విజయంతో ముగించింది భారత షట్లర్ పీవీ సింధు. శుక్రవారం జరిగిన గ్రూప్​ దశ ఆఖరి మ్యాచ్​లో థాయ్​లాండ్​ స్టార్​ షట్లర్​ చోచువాంగ్​ను వరుస సెట్లలో ఓడించింది. అయినప్పటికీ తొలి రెండు మ్యాచ్​లలో ఓడిన సింధు.. టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు.

ఎట్టకేలకు ఫామ్​లో..

మూడో మ్యాచ్​లో తొలి సెట్​ హోరాహోరీగా సాగింది. చోచువాంగ్​, సింధు మధ్య ఆధిక్యం దోబూచులాడింది. అయితే తన అత్యున్నత ఫామ్​ అందుకున్న సింధు.. పైచేయి సాధించింది. ఆ గేమ్​ను 21-18తో దక్కించుకుంది. ఇక రెండో సెట్​లో తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన సింధు.. 21-15తో మ్యాచ్​ గెలిచింది.

అయితే ఈ ఓటమితో చోచువాంగ్​కు పెద్దగా నష్టం లేదు. ఆమె ఇప్పటికే రెండు మ్యాచ్​లు గెలిచి సెమీస్​కు అర్హత సాధించింది.

ముగిసిన కథ..

బుధవారం తొలి మ్యాచ్​లో తైజు ఇంగ్​ చేతిలో, గురువారం రెండో మ్యాచ్​లో రచనోక్ చేతిలో సింధు ఓడిపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్​లోనూ భారత షట్లర్​ కిదాంబి శ్రీకాంత్ టోర్నీ నుంచి శుక్రవారం నిష్క్రమించాడు. అతడు గ్రూప్​ దశ మూడు మ్యాచుల్లోనూ ఓటమి చవిచూశాడు. డబ్ల్యూటీఎఫ్​ టోర్నీకి అర్హత సాధించిన భారత షట్లర్లు వీరిద్దరు మాత్రమే. వారి నిష్క్రమణతో టోర్నీలో భారత్ ప్రస్థానం ముగిసింది.

ఇదీ చూడండి: వారంలోనే రెండో 'థాయ్​' టైటిల్​​ గెలిచిన కరోలినా​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.