ETV Bharat / sports

లక్ష్యసేన్.. భారత బ్యాడ్మింటన్ భవిష్యత్ ఆశాకిరణం ​

author img

By

Published : Dec 19, 2021, 6:53 AM IST

Lakshya Sen World Badminton Championship: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్​షిప్ మొదలైనపుడు ఈ కుర్రాడిపై అంతగా అంచనాలు లేవు. అసలు ఆ పేరు కూడా ఎవరికీ సరిగా పరిచయం లేదు. కానీ ఈ టోర్నీతో తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాడు భారత యువ షట్లర్ లక్ష్యసేన్. ఛాంపియన్ షిప్స్​లో సెమీఫైనల్ వరకు చేరి కాంస్యంతో సత్తాచాటాడు. సెమీస్​లో మరో భారత సీనియర్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్​ చేతిలో ఓడినా.. ఈ యువ షట్లర్ పోరాటం మాత్రం భవిష్యత్​పై ఆశలు రేకెత్తిస్తోంది.

lakshya sen, లక్ష్యసేన్
లక్ష్యసేన్

Lakshya Sen World Badminton Championship: ఈసారి ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ మొదలు కాగానే సింధు టైటిల్‌ నిలబెట్టుకుంటుందా? అని అభిమానులు ఆలోచించి ఉంటారు.. కిదాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌ లాంటి సీనియర్లకు ఈసారైనా ఏమైనా అవకాశం ఉంటుందా? అని అంచనాలు వేసి ఉంటారు.. కానీ ఎవరూ అనుకోని.. పెద్దగా అంచనాలు లేని ఓ టీనేజర్‌ పతకం గెలుస్తాడనని అస్సలూ ఊహించి ఉండరు.. కానీ అంచనాలకు అందకుండా.. కఠిన ప్రత్యర్థులకు లొంగకుండా పతకం గెలిచాడు లక్ష్యసేన్‌! బ్యాడ్మింటన్‌ కుటుంబం నుంచి వచ్చిన 20 ఏళ్ల సేన్‌ భవిష్యత్‌ తారగా నిరూపించుకున్నాడు.

ఉత్తరాఖండ్‌లోని ఆల్మోరాకు చెందిన లక్ష్యసేన్‌ పేరు చాలా కాలంగా భారత బ్యాడ్మింటన్‌ సర్క్యూట్‌లో వినిపిస్తున్నా.. అతడికి అసలైన గుర్తింపు వచ్చింది ఈ ప్రపంచ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ద్వారానే. కానీ అతడు ప్రణాళిక వేసుకుని ఈ ఆటలోకి రాలేదు. అతడి రాకే కాకతాళీయం. నాన్న ధీరేంద్ర సేన్‌ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్‌ ఆటగాడు.. ఆ తర్వాత కోచ్‌గా మారాడు. ఇక అన్న చిరాగ్‌సేన్‌ అంతర్జాతీయ షట్లర్‌గా పలు టైటిళ్లు గెలిచాడు. అన్నతో పాటు టోర్నీలకు వెళ్లడం ద్వారా అతడికి బ్యాడ్మింటన్‌పై ఆసక్తి కలిగింది. ప్రకాశ్‌ పదుకొనే ఆధ్వర్యంలోని అకాడమీకి షట్లర్లను ఎంపిక చేయడం కోసం ఓ సబ్‌ జూనియర్‌ టోర్నమెంట్‌కు వచ్చిన కోచ్‌ విమల్‌ కుమార్‌ను తనకు అకాడమీలో చేరాలని ఉందని అడిగాడు లక్ష్య. అప్పటికి అతడి వయసు తొమ్మిదేళ్లే. అయితే ట్రయల్‌ ద్వారా అతడి సత్తాను పరీక్షించిన విమల్‌..లక్ష్యను అకాడమీకి ఎంపిక చేశాడు.

lakshya sen, లక్ష్యసేన్
లక్ష్యసేన్

ఓడితే ఏడ్చేవాడు

చిరాగ్‌తో పాటు ప్రకాశ్‌ పదుకొనే అకాడమీకి ఎంపికైన లక్ష్య అక్కడ పదును తేలాడు. ఆరేళ్ల వ్యవధిలో సేన్‌.. అండర్‌-13, 17, 19 జాతీయ టోర్నీల్లో విజయాలు అందుకున్నాడు. 15 ఏళ్ల వయసులో జాతీయ అండర్‌-19 పతకం గెలిచాడు. ఓటమిని అస్సలు అంగీకరించని తత్వం ఉన్న సేన్‌.. ఓడితే ఏడ్చేవాడు. సహజసిద్ధంగా బలమైన కాళ్లు ఉన్న లక్ష్య కోర్టులో ఎంతసేపైనా అలుపెరగకుండా పరుగెత్తేవాడు. ఈ బలానికి టెక్నిక్‌ను జత చేసిన ఈ కుర్రాడు సీనియర్లను ఓడిస్తూ అందరి దృష్టిలో పడ్డాడు. 2016లో ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ అతడిలోని సత్తాను వెలుగులోకి తెచ్చింది. ఆ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్‌ ఆటగాడిని ఓడించిన అతడు.. అదే జోరులో సీనియర్‌ సర్క్యూట్‌లో అడుగుపెట్టి హైదరాబాద్‌లో జరిగిన శాట్స్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఆ తర్వాత 2017లో బల్గేరియా ఓపెన్‌, టాటా ఓపెన్‌తో పాటు 2018లో ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ సేన్‌ సొంతమయ్యాయి. ఆసియా ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ విదిత్‌ సరన్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. అదే ఏడాది ప్రపంచ జూనియర్‌ టోర్నీలోనూ కాంస్యం గెలిచాడు.

lakshya sen, లక్ష్యసేన్
లక్ష్యసేన్

"ప్రకాశ్‌ పదుకొనె సారే నాకు గొప్ప స్ఫూర్తి. పదుకొనె ఆడిన మ్యాచ్‌లు చూసి మెలకువలు నేర్చుకునేవాడిని. ఆయన అనుభవ పాఠాలు నాకెంతో నేర్పించాయి. ఆయన గేమ్‌ నుంచి డ్రిబిల్స్‌, హాఫ్‌ స్మాష్‌లు లాంటివి నేర్చుకున్నా. ప్రకాశ్‌ సార్‌తో పాటు కోచ్‌ విమల్‌ కుమార్‌ వల్లే వేగంగా ఎదగగలిగా" అని లక్ష్యసేన్‌ చెప్పాడు.

"తాజాగా దుబాయ్‌లో వెళ్లి ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌తో కలిసి రెండు వారాలు తీసుకున్న శిక్షణ లక్ష్యకు కలిసొచ్చింది. మూడు నెలలుగా ఐరోపాలో టోర్నీలు ఆడడం వల్ల సేన్‌ ఆట మరింత మెరుగైంది" అని కోచ్‌ విమల్‌ తెలిపాడు.

లక్ష్యసేన్‌ ప్రధాన విజయాలు

  • 2016 ఆసియా జూనియర్‌ టోర్నీ-బ్యాంకాక్‌, కాంస్యం
  • 2018 ఆసియా జూనియర్‌ టోర్నీ-జకర్తా, సింగిల్స్‌ ఛాంపియన్‌
  • 2018 యూత్‌ ఒలింపిక్స్‌-బ్యూనస్‌ ఎయిర్స్‌, రజతం. మిక్స్‌డ్‌ టీమ్‌లో స్వర్ణం
  • 2018 ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌- మార్క్‌హమ్‌, కాంస్యం
  • 2020 ఆసియా టీమ్‌ ఛాంపియన్‌షిప్‌-మనీలా, కాంస్యం

ఇవీ చూడండి: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రికార్డ్ సృష్టించిన కిదాంబి శ్రీకాంత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.