వియత్నాం ఓపెన్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు భారత యువ షట్లర్ సౌరభ్ వర్మ. పురుషుల సింగిల్స్ సూపర్ 100 విభాగంలో పోటీపడిన ఈ ఆటగాడు... ఆదివారం జరిగిన ఫైనల్లో సన్ ఫె జియాంగ్(చైనా)ను ఓడించాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో 21-12, 17-21, 21-14 తేడాతో గెలిచాడు సౌరభ్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో తొలి రెండు సెట్లను చెరొకరు గెలుచుకోగా.. కచ్చితంగా నెగ్గాల్సిన మూడో సెట్లో తిరుగులేని స్మాష్లతో ప్రత్యర్థిని వణికించాడు సౌరభ్. చివరికి 7 పాయింట్ల ఆధిక్యంతో సెట్ కైవసం చేసుకుని టోర్నీ విజేతగా నిలిచాడు.
శనివారం జరిగిన సెమీస్లో మినోరు కొగా(జపాన్)ను ఓడించాడు. ఈ మ్యాచ్ను 22-20, 21-15 వరుస సెట్లలో గెలిచాడు సౌరభ్. ఈ మ్యాచ్ 51 నిమిషాల పాటు సాగింది. ప్రస్తుతం ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో 38వ స్థానంలో కొనసాగుతున్నాడు సౌరభ్.