ETV Bharat / sports

సైనా, శ్రీకాంత్​లు 'ఒలింపిక్స్' బెర్తు సాధించేనా! - Time is running out for Saina, Srikanth to qualify for Olympics

స్విస్​ ఓపెన్​లో పేలవ ప్రదర్శన చేసిన భారత బ్యాడ్మింటన్​ ఆటగాళ్లు సైనా, శ్రీకాంత్​.. ఒలింపిక్స్​ అవకాశాలను మరింత చేజార్చుకున్నారు. రానున్న ఐదు టోర్నీల్లో ఇదే విధంగా ఆడితే వారు టోక్యో బెర్తు దక్కించుకోవడం కష్టమనే చెప్పాలి.

Time is running out for Saina, Srikanth to qualify for Olympics
సైనా, శ్రీకాంత్​లు 'ఒలింపిక్స్' బెర్తు సాధించేనా!
author img

By

Published : Mar 10, 2021, 1:30 PM IST

Updated : Mar 10, 2021, 2:44 PM IST

భారత బ్యాడ్మింటన్​ స్టార్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్​లకు ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. స్విస్​ ఓపెన్​ ఓటమితో సైనా, శ్రీకాంత్​ల ఒలింపిక్​ అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి. మెగా ఈవెంట్​కు ముందు మరో ఐదు అర్హత టోర్నీలు మాత్రమే ఉన్నాయి. వీటిల్లో మంచి ప్రదర్శన చేస్తేనే ఈ ఇద్దరికీ ఒలింపిక్స్​లో స్థానం దక్కుతుంది.

2012 లండన్​ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్.. ప్రస్తుతం 19వ ర్యాంక్​లో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన స్విస్ ఓపెన్​లో తొలి రౌండ్​లోనే నిష్క్రమించింది ఈ షట్లర్​. దీంతో ఒలింపిక్స్​ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. రానున్న టోర్నీల్లో మంచి ప్రదర్శన చేసి 16వ ర్యాంక్​కు చేరితే సైనాకు ఒలింపిక్​ బెర్తు దక్కుతుంది. లేకపోతే కష్టమనే చెప్పాలి. ఆమె టాప్​ 10లోకి వచ్చే అవకాశమైతే లేనప్పటికీ.. టాప్​ 10లో ఉన్న ఆశావాహులను రానున్న టోర్నీల్లో ఓడించడం ద్వారా సైనా అవకాశాలను మెరుగు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ విభాగంలో పీవీ సింధు ఒలింపిక్స్​కు అర్హత సాధించింది.

మాజీ నంబర్1 ఆటగాడు కిదాంబి శ్రీకాంత్​.. గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. స్విస్​ ఓపెన్​లో సెమీస్​ వరకు వెళ్లిన అతడు విక్టోర్ అక్సెల్సన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ప్రస్తుతం 13వ ర్యాంకులో కొనసాగుతున్న కిదాంబి.. రానున్న టోర్నీల్లో తన ర్యాంకును కాపాడుకుంటే మెగా ఈవెంట్​లో పాల్గొనడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఇతనికి మరో సింగిల్స్ ఆటగాడు సాయి ప్రణీత్​ నుంచి పోటీ ఉంది. 2019 వరల్డ్​ ఛాంపియన్​షిప్స్​లో కాంస్య విజేత ప్రణీత్​.. బాసెల్​లో జరిగిన టోర్నీలో క్వార్టర్​ ఫైనల్​కు చేరాడు. ప్రస్తుతం 16వ ర్యాంక్​లో కొనసాగుతున్నాడు.

ఇక పురుషుల డబుల్స్​ విభాగానికొస్తే సాత్విక్​ రాజ్​-చిరాగ్​ శెట్టి జంట ఇబ్బంది లేకుండా ఒలింపిక్స్​కు వెళ్లొచ్చు. ప్రస్తుతం ఈ జోడీ ర్యాంకింగ్స్​​లో 10వ స్థానం​లో ఉంది. ఇదే విభాగంలోని మరో​ జంట మను అత్రి-సుమిత్​ రెడ్డిలు 35వ ర్యాంక్​లో ఉండటం వల్ల సాత్విక్​-చిరాగ్​ల జోడీకి వచ్చిన ముప్పేమీ లేదనే చెప్పాలి.

"శ్రీకాంత్, సింధు, చిరాగ్, సాత్విక్​లు ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తారని అనుకుంటున్నాను. స్విస్​ ఓపెన్​ ప్రదర్శన ద్వారా సింధు, శ్రీకాంత్​లు తమ ర్యాంకింగ్​ స్థానాలను మెరుగుపరుచుకున్నారు. ఏ విధంగా చూసిన వీరు ఒలింపిక్స్​లోకి అడుగు పెడుతారనడంలో ఎలాంటి సందేహం లేదు."

-ఉదయ్​ పవార్, పురుషుల సింగిల్స్​ షట్లర్​.

ఇదీ చదవండి: ఏడాది తర్వాత కోర్టులోకి ఫెదరర్​-ఇవాన్స్​తో ఢీ

Last Updated : Mar 10, 2021, 2:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.