ETV Bharat / sports

ర్యాంకింగ్స్​లో టాప్-10లో సాత్విక్ - చిరాగ్ జోడీ - chirag

తాజా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్​లో భారత షట్లర్లు చాలామంది యథాస్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే పురుషుల డబుల్స్​లో సాత్విక్- చిరాగ్ జోడి టాప్-10లో చోటుదక్కించుకుంది. ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో ఉంది.

ర్యాంకింగ్స్​
author img

By

Published : Aug 7, 2019, 6:57 AM IST

భారత బ్యాడ్మింటన్​ పురుషుల జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ర్యాంకింగ్స్​లో టాప్-10లో చోటు దక్కించుకుంది. ఆదివారం థాయ్​లాండ్ ఓపెన్ నెగ్గి రికార్డు సృష్టించిన ఈ ద్వయం తాజా ర్యాంకింగ్స్​లో ఏడు స్థానాలు ఎగబాకి 9వ స్థానంలో నిలిచింది.

మను అత్రి - సుమిత్​​ డబుల్స్ జోడీ 25వ స్థానంలో ఉంది. పురుషుల సింగిల్స్​ ర్యాంకింగ్స్​లో పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. కిదాంబి శ్రీకాంత్ 10, సమీర్ వర్మ 13, సాయి ప్రణీత్ 19, ప్రణయ్ 31, సౌరవ్ వర్మ 44 స్థానాల్లో కొనసాగుతున్నారు. పారుపల్లి కశ్యప్ మూడు స్థానాలు మెరుగు పరుచుకుని 32వ స్థానంలో ఉన్నాడు.

మహిళల సింగిల్స్​ విభాగంలో సింధు 5వ స్థానంలో ఉండగా.. సైనా నెహ్వాల్ 8వ స్థానంలో కొనసాగుతుంది. మహిళల డబుల్స్​లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జోడీ ఓ స్థానం మెరుగుపరచుకుని 23వ ర్యాంకులో ఉంది.

ఇది చదవండి: పుజారాను వెనక్కి నెట్టిన స్మిత్.. అగ్రస్థానంలో కమిన్స్​

Special Advisory
Tuesday 6th August 2019
Clients, please note we will have coverage of Wayne Rooney's press conference at Derby County following his appointment as player-coach at the English Championship soccer club on an initial 18-month deal from next January.
Expect video to be available around 1800 GMT.
Regards,
SNTV London
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.