థాయ్‌లాండ్ ఓపెన్‌లో భారత్ స్టార్ బ్యాడ్మింటర్ క్రీడాకారిణి పీవీ సింధు కథ ముగిసింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మలేషియాకు చెందిన రచనోక్ ఇంటనాన్ చేతిలో ఓడిపోయింది సింధు. ఆది నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన ఇంటనాన్.. 21-13, 21-9తో వరుస సెట్లలో నెగ్గి భారత్ షట్లర్‌ను ఇంటికి చేర్చింది.
పోరాడినా నిరాశే..
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో థాయ్‌లాండ్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు సమీర్ వర్మ. క్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన ఆండర్స్ ఆంటోన్సెన్తో హోరాహోరీగా తలపడిన అతడు.. 13-21, 21-19, 20-22 తేడాతో ఓడిపోయాడు.
-
HIGHLIGHTS | Unseeded Verma 🇮🇳 brings his A-game to rival third seed Antonsen 🇩🇰 🏸#HSBCbadminton #BWFWorldTour #ToyotaThailandOpen pic.twitter.com/EU2KJKdLEY
— BWF (@bwfmedia) January 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">HIGHLIGHTS | Unseeded Verma 🇮🇳 brings his A-game to rival third seed Antonsen 🇩🇰 🏸#HSBCbadminton #BWFWorldTour #ToyotaThailandOpen pic.twitter.com/EU2KJKdLEY
— BWF (@bwfmedia) January 22, 2021HIGHLIGHTS | Unseeded Verma 🇮🇳 brings his A-game to rival third seed Antonsen 🇩🇰 🏸#HSBCbadminton #BWFWorldTour #ToyotaThailandOpen pic.twitter.com/EU2KJKdLEY
— BWF (@bwfmedia) January 22, 2021
నరాలు తెగే ఉత్కంఠతో గంట 21 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. తొలి గేమ్‌ను 21-13తో ఆంటోన్సెన్ కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో పుంజుకున్న వర్మ.. అద్భుతంగా పోరాడి 21-19తో గెలిచి ఆటను రసవత్తరంగా మార్చాడు. మూడో గేమ్‌లో మిడ్ బ్రేక్ వరకు 11-8తో ఆధిపత్యం ప్రదర్శించాడు భారత షట్లర్. అయితే తన అనుభవాన్నంతా ఉపయోగించిన ఆంటోన్సెన్.. 22-20తో మ్యాచ్‌ను ఎగరేసుకుపోయాడు.
ఇదీ చూడండి: థాయ్‌లాండ్ ఓపెన్ సెమీస్‌లో సాత్విక్-అశ్విని జోడీ