థాయ్‌లాండ్ ఓపెన్‌లో పాల్గొన్న భారత్ స్టార్ షట్లర్ సాయి ప్రణీత్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడు ప్రస్తుతం జరుగుతున్న టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్ మధ్యలోనే నిష్కమించాల్సి వచ్చింది. ప్రస్తుతం అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పది రోజులు పాటు క్వారంటైన్లో ఉండనున్నాడు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య స్పష్టం చేసింది.
బుధవారం ప్రణీత్.. తొలి రౌండ్లో డారెన్ లీ(మలేసియా)తో తలపడాలి. అయితే ప్రణీత్ వైదొలగడం వల్ల 'లీ'కు వాకోవర్ లభించింది. మరోవైపు ప్రణీత్‌తో కిదాంబి శ్రీకాంత్ సన్నిహితంగా ఉండటం వల్ల అతడు కూడా టోర్నీ మధ్యలోనే నిష్క్రమించాడు.
టొయోటా థాయ్‌లాండ్ ఓపెన్ తొలి రౌండ్లో మంగళవారం.. స్థానిక ఆటగాడు థమ్మాసిన్పై 21-11,21-11తో నెగ్గి రౌండ్ రౌండ్లోకి ప్రవేశించాడు శ్రీకాంత్.
ఇదీ చూడండి : థాయ్‌లాండ్ ఓపెన్‌లో సింధు, శ్రీకాంత్ శుభారంభం