ETV Bharat / sports

సైనా, ప్రణయ్​కు కరోనా నెగటివ్​.. థాయ్​ ఓపెన్​కు సిద్ధం - Thailand Open saina corona negative

థాయ్​లాండ్​ ఓపెన్​లో తొలుత కరోనా పాజిటివ్​గా తేలిన భారత స్టార్​ షట్లర్లు​​ సైనా నెహ్వాల్, ప్రణయ్​కు మళ్లీ చేసిన పరీక్షల్లో కరోనా నెగెటివ్​గా తేలింది. దీంతో వారిద్దరు బుధవారం జరగబోయే మ్యాచ్​లలో బరిలో దిగనున్నారని బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా(బాయ్​)​ తెలిపింది.

saina
సైనా
author img

By

Published : Jan 12, 2021, 7:13 PM IST

Updated : Jan 12, 2021, 7:32 PM IST

థాయ్​లాండ్​ ఓపెన్​లో తొలుత కరోనా పాజిటివ్​గా తేలిన భారత స్టార్​ షట్లర్లు​ సైనా నెహ్వాల్, ప్రణయ్​​కు నాలుగో రౌండ్​ వైరస్​ నిర్ధరణ పరీక్షల్లో నెగెటివ్​గా తేలింది. ​ వైరస్​ ఫలితంగా వీరిద్దరూ బుధవారం.. టోర్నీలో పాల్గొననున్నట్లు స్పష్టం చేసింది బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా(బాయ్​).

మంగళవారం.. సైనాతో మ్యాచు​లో తలపడాల్సిన మలేసియాకు చెందిన కిసోనా సెల్వదురాయ్​కు వాకోవర్ లభించింది. అయితే బుధవారం జరగనున్న మ్యాచులో ఈమెతోనే సైనా తన తొలి పోరును ప్రారంభించనుందని బాయ్​ వర్గాలు తెలిపాయి. మరోవైపు సైనాకు వైరస్​ సోకిందన్న నేపథ్యంలో ఆమె భర్త స్టార్​ షట్లర్​ కశ్యప్​ స్వీయనిర్బంధంలోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో అతడు కూడా మంగళవారం జరిగిన మ్యాచుకు దూరమయ్యాడు. అయితే ఇతడు ​కూడా బుధవారం జరగబోయే మ్యాచులో బరిలో దిగనున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చూడండి : బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్​కు కరోనా

Last Updated : Jan 12, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.