ETV Bharat / sports

ఒలింపిక్స్​కు ముందు భారత షట్లర్లకు 'స్విస్' పరీక్ష? - సైనా నెహ్వాల్​ వార్తలు

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించేందుకు బ్యాడ్మింటన్​ క్రీడాకారులకు కీలకమైన స్విస్​ ఓపెన్​ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భారత్​కు చెందిన ప్రపంచ ఛాంపియన్లు, మాజీ ఛాంపియన్లు పాల్గొననున్నారు. అయితే ఈ టోర్నీలో భారత షట్లర్లు తమ తొలిమ్యాచ్​ల్లో ఎవరితో తలపడనున్నారో తెలుసుకుందాం.

Swiss Open: Sindhu, Saina may face off in semis; all eyes on Chirag-Satwik
స్విస్​ ఓపెన్​: టోర్నీకి సిద్ధమైన భారత షట్లర్లు
author img

By

Published : Mar 2, 2021, 5:31 AM IST

స్విట్జర్లాండ్​ వేదికగా మంగళవారం నుంచి స్విస్​ ఓపెన్​ ప్రారంభంకానుంది. ఇందులో భారత షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్​ పాల్గొననున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచిన సైనా.. ఈసారి టైటిల్​ను సాధించాలని చూస్తోంది. అలా నిలవాలంటే ఆరో సీడ్​ సుంగ్​ జీ హ్యూన్​తో పాటు నాలుగో సీడ్​ డానిష్​కు చెందిన మియా బ్లిక్​ఫెల్ట్​పై పైచేయి సాధించాలి. ఒకవేళ వీరిద్దరిపై సైనా గెలుపొందితే.. టోర్నీ సెమీస్​లో పీవీ సింధుతో పోటీ పడే అవకాశం ఉంది. సైనా తన తొలి మ్యాచ్​లో థాయ్​లాండ్​కు చెందిన ఫిట్టాయపోర్న్ చైవాన్​తో​ పోటీపడనుంది.
అలాగే కరోనా సంక్షోభానికి ముందు 2019లో జరిగిన బ్యాడ్మింటన్​ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో పీవీ సింధు పసిడి పతకాన్ని సాధించింది. జనవరి చివరి వారంలో జరిగిన వరల్డ్​ టూర్​ ఫైనల్స్​ను విజయంతో ముగించిన సింధు.. స్విస్​ ఓపెన్ టైటిల్​ సాధించాలనే పట్టుదలతో ఉంది. ప్రస్తుతం జరగబోతున్న స్విస్​ ఓపెన్​లో టర్కీకి చెందిన నెస్లిహన్ యిగిట్​తో సింధు తన తొలి మ్యాచ్​ ఆడనుంది.
పురుషుల సింగిల్స్​లో..

స్విస్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​లో భారతీయ షట్లర్లు సమీర్​ వర్మ (2018), హెచ్​ఎస్​ ప్రణయ్​ (2016), కిదాంబి శ్రీకాంత్​ (2015) విజేతలుగా నిలిచారు. 2019లో చివరిగా జరిగిన టోర్నీలో యువ షట్లర్​ బీ సాయి ప్రణీత్​ రన్నరప్​తో సరిపెట్టుకున్నాడు. ఈ నలుగురు బ్యాడ్మింటన్​ ఆటగాళ్లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.

పురుషుల డబుల్స్​లో.. ​

పురుషుల డబుల్స్​ విభాగంలో భారత్​ నుంచి సాత్విక్​ సాయిరాజ్​ రంకిరెడ్డి, చిరాగ్​ శెట్టి పాల్గొననున్నారు. ఇటీవలే వీరిద్దరూ కలిసి టయోటా థాయ్​లాండ్​ ఓపెన్​ సెమీస్​లో సత్తాచాటారు. స్కాట్లాండ్​కు చెందిన క్రిస్టోఫర్​ గ్రిమ్లే, మాథ్యూ గ్రిమ్లే ద్వయంతో సాత్విక్​, చిరాగ్​ తమ తొలిపోటీని ఎదుర్కోవాల్సిఉంది.

స్విస్​ ఓపెన్​ పురుషుల సింగిల్స్​ తొలి మ్యాచ్​ల వివరాలు

  1. ప్రపంచ మాజీ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​ కిదాంబి శ్రీకాంత్​తో సమీర్​ వర్మ తలపడనున్నాడు.
  2. నెదర్లాండ్​కు చెందిన మార్క్​ కాలిజౌతో హెచ్​ఎస్​ ప్రణయ్​ తన తొలిపోటీని ఎదుర్కొనున్నాడు.
  3. స్విట్జర్లాండ్​కు చెందిన క్రిస్టియన్​ క్రిచ్​మైర్​తో భారత షట్లర్​ సౌరభ్ వర్మ ఆడనున్నాడు. ​
  4. థాయ్​లాండ్​కు చెందిన సిత్తికోమ్ తమ్మసిన్​తో అజయ్​ జయరామ్​ తలపడనుండగా.. స్పెయిన్​కు చెందిన పాబ్లో అబియాన్​తో పారుపల్లి కశ్యప్​ తన తొలిమ్యాచ్​ ఆడనున్నాడు.
  5. కరోనా సోకిన కారణంగా ఇటీవలే జరిగిన థాయ్​లాండ్​ ఓపెన్​ నుంచి తప్పుకున్న సాయి ప్రణీత్​.. ఇజ్రాయెల్​కు చెందిన మిషా జిల్​బర్​మాన్​తో తన తొలిమ్యాచ్​లో తలడనున్నాడు.
  6. లక్ష్య సేన్ (భారత్​) - తనోంగ్సాక్ సెన్సోంబూన్సుక్ (థాయ్​లాండ్​)తో తొలి మ్యాచ్​ ఆడనున్నాడు.

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించాలంటే ఈ సూపర్​-300 ఈవెంట్​ బ్యాడ్మింటన్​ క్రీడాకారులకు కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్​కు అర్హత సాధించేందుకు క్యాలిఫయర్ గడువును జూన్​ 15 వరకు ప్రపంచ బ్యాడ్మింటన్​ సమాఖ్య పొడిగించనుంది.

ఇదీ చూడండి: ఒలింపిక్స్ కోసం సోషల్ మీడియాకు దూరమైన రెజ్లర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.