ETV Bharat / sports

స్విస్​ ఓపెన్: సైనా, కశ్యప్ నిష్క్రమణ - సౌరభ్ వర్మ

స్విస్​ ఓపెన్​లో ఆదిలోనే ఇంటి బాట పట్టారు భారత షట్లర్లు సైనా నెహ్వాల్​, పారుపల్లి కశ్యప్. బుధవారం జరిగిన తొలి రౌండ్​లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

Swiss Open: Nehwal, Kashyap crash out; Praneeth, Sourabh advance to second round
స్విస్​ ఓపెన్ నుంచి సైనా, కశ్యప్ నిష్క్రమణ
author img

By

Published : Mar 4, 2021, 10:02 AM IST

స్విస్​ ఓపెన్​ నుంచి నిష్క్రమించింది ఒలింపిక్ విజేత, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్. బుధవారం హోరాహోరీగా జరిగిన తొలి రౌండ్​లో థాయ్​లాండ్​కు చెందిన చైవాన్ చేతిలో 16-21, 21-17, 21-23 తేడాతో ఓడిపోయింది.

సైనా భర్త పారుపల్లి కశ్యప్​ కూడా తొలి రౌండ్​లోనే ఇంటిముఖం పట్టాడు. అత్యంత తక్కువ ర్యాంకు షట్లర్ పాబ్లో ఏబియన్ చేతిలో 15-21, 10-21 తేడాతో వరుస సెట్లలో ఓటమి చెందాడు.

యువ కెరటాల జోరు..

ఇక భారత యువ షట్లర్లు సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ, అజయ్ జయరామ్ టోర్నీలో రెండో రౌండ్​కు చేరుకున్నారు. అంతకుముందు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ కూడా తొలి రౌండ్​లో గెలిచి ప్రిక్వార్టర్స్​కు దూసుకెళ్లారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.