అంతర్జాతీయ టోర్నీలపై దృష్టిపెట్టి.. బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్‌కు దూరమైన భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో రష్యాకు చెందిన వ్లాదిమిర్ మాల్కొవ్పై నెగ్గి తర్వాతి రౌండుకు చేరుకున్నాడు.
పురుషుల సింగిల్స్ విభాగంలో 21-12, 21-11 తేడాతో వరుస సెట్లలో గెలిచాడు శ్రీకాంత్. కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించి గెమ్ సొంతం చేసుకున్నాడు. తర్వాతి రౌండ్లో భారత షట్లర్ పారుపల్లి కశ్యప్‌తో తలపడనున్నాడు శ్రీకాంత్.
మహిళల సింగిల్స్‌లో అస్మితా చాలిహా శుభారంభం చేసింది. భారత్‌కే చెందిన వృశాలీ గుమ్మడిపై 21-16, 21-16 తేడాతో నెగ్గి.. 32 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది.
ఇదీ చదవండి: గవర్నర్‌గా అవతారమెత్తనున్న శ్రీలంక క్రికెట్ లెజెండ్..!