సింగపూర్ ఓపెన్‌లో ఈ రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పీవీ సింధు సెమీస్‌కు చేరగా, మరో క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఇంటిముఖం పట్టింది.
సింధు...చైనాకు చెందిన కాయ్ యాన్యన్పై 21-13, 17-21, 21-14 తేడాతో గెలిచింది. ఈ సీజన్లో సెమీస్ చేరడం సింధుకు ఇది రెండోసారి. గత నెలలో ఇండియన్ ఓపెన్‌లోనూ సెమీస్ చేరుకుందీ షట్లర్. సైనా... జపాన్‌కు చెందిన ఒకుహరా చేతిలో 21-8, 21-13 తేడాతో ఓడిపోయింది. తర్వాతి మ్యాచ్‌లో సింధు తలపడనుంది ఒకుహరాతోనే.