ప్రపంచ ఛాంపియన్‌షిప్ సెమీస్‌లో విజయం సాధించిన అనంతరం మాట్లాడిన సింధు.. " ఫైనల్ వరకు చేరినందుకు ఆనందంగా ఉన్నా సంతృప్తిగా లేను" అని ఉద్వేగంతో మాట్లాడింది. ఆ మాటల్ని నిజం చేస్తూ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది.
ఒకుహుర(జపాన్)తో ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్ గెలిచి... తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకుంది సింధు. ఫైనల్ మ్యాచ్‌లో వరుసగా రెండు సెట్లలోనూ జపాన్ ప్లేయర్‌ను చిత్తుచేసి ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జగజ్జేతగా నిలిచింది. గతంలో రెండు సార్లు చివరి మెట్టుపై తడబడిన సింధు.. ఈ సారి పసిడి సొంతం చేసుకుంది.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు... తొలి సెట్ 21-7 తేడాతో గెలిచింది. రెండో సెట్లోనూ అదే జోష్ చూపించి 21-7తేడాతో విజయం సాధించింది. తెలుగమ్మాయి తిరుగులేని స్మాష్‌లకు జపాన్ క్రీడాకారిణి సమాధానం చెప్పలేకపోయింది.
-
PV Sindhu beats Japan's Nozomi Okuhara 21-7, 21-7; becomes 1st Indian to win BWF World Championships gold medal. (file pic) pic.twitter.com/SNHfvka84A
— ANI (@ANI) August 25, 2019 3" class="align-text-top noRightClick twitterSection" data="
3">PV Sindhu beats Japan's Nozomi Okuhara 21-7, 21-7; becomes 1st Indian to win BWF World Championships gold medal. (file pic) pic.twitter.com/SNHfvka84A
— ANI (@ANI) August 25, 2019
3PV Sindhu beats Japan's Nozomi Okuhara 21-7, 21-7; becomes 1st Indian to win BWF World Championships gold medal. (file pic) pic.twitter.com/SNHfvka84A
— ANI (@ANI) August 25, 2019
అసాధారణ ప్రతిభ...
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు ప్రస్థానం అసాధారణం. ప్రకాశ్ పదుకొనే కాంస్యం నెగ్గాక మరో పతకం కోసం మూడు దశాబ్దాలు సాగిన నిరీక్షణకు 2013లో తెరదించుతూ కాంస్యం నెగ్గింది. అయితే తర్వాత ఇంకో మూడు పతకాలు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఇప్పటికే ఈ టోర్నీలో సింధు ప్రదర్శన అద్భుతంగా సాగినా... స్వర్ణం సాకారం కాలేదు. గతంలో జరిగిన రెండు ఫైనల్లోనూ గొప్పగా పోరాడి ఓడి రజతాలతో సరిపెట్టుకుంది.
ప్రతీకారం తీరింది..
జపాన్ క్రీడాకారిణి ఒకుహరతో పోటీపడిన మ్యాచ్‌ల్లో 8-7తో సింధూదే పైచేయి. 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్ తుదిపోరులో సింధు.. ఒకుహర చేతిలోనే ఓడింది. తొలిసారి ఆ ప్రతిష్ఠాత్మక టోర్నీ ఫైనల్ చేరి టైటిల్‌కు అత్యంత చేరువగా వెళ్లిన ఆమెకు నిరాశను మిగిల్చిందీ జపాన్ స్టార్. మళ్లీ రెండేళ్ల తర్వాత సింధును అడ్డుకోవడానికి సిద్ధమైంది. ఈసారి ఒకుహరను మట్టికరిపించి పసిడి కల నెరవేర్చుకుంది తెలుగమ్మాయి. 2017 పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది.