సింగపూర్ ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవి సింధు కథ ముగిసింది. సెమీస్‌లో జపాన్‌కు చెందిన ఒకుహరా చేతిలో ఓడిపోయింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే 7-21,11-21 తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది.
సింగపూర్ ఓపెన్‌లో ఒకుహరాతో తలపడిన గత రెండుసార్లు సింధునే గెలిచింది. కానీ ఈసారి సింధుకి ఓటమి తప్పలేదు. అనవసర తప్పిదాలు చేసిన సింధు... మ్యాచ్‌ను ఏకాగ్రతతో ఆడలేకపోయింది. ప్రత్యర్థి ఒకుహరా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి, గేమ్‌ను తన వశం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ నంబరు వన్ తైజుంగ్తో తలపడనుంది.
మరో సెమీస్‌లో యమగూచిపై 15-21,24-22,21-19 తేడాతో గెలిచిన తైజుంగ్ గెలిచి, తుదిపోరుకు అర్హత సాధించింది.
- సింధు-ఒకుహరా మధ్య జరిగిన 2017 ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరు ఇప్పటికీ రికార్డే. 110 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌లో విజయం ఒకుహరానే వరించింది.
ఇది చదవండి: ఈ ఏటి మేటి ఆటగాళ్లు... నీరజ్ చోప్రా, సింధు