ప్రపంచ ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత షట్లర్ సింధు.. ఆ తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతోంది. ప్రస్తుతం జరుగుతోన్న డెన్మార్క్ ఓపెన్లో రెండో రౌండ్లోనే ఓడి నిష్క్రమించింది. భారత ఆటగాడు సమీర్ వర్మ, డబుల్స్ ద్వయం సాత్విక్-చిరాగ్ శెట్టి కూడా ఇంటిముఖం పట్టారు.
ఐదో సీడ్ సింధు.. కొరియా క్రీడాకారిణి ఆన్ సే యంగ్ చేతిలో 14-21, 17-21 తేడాతో ఓటమి పాలైంది. ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాత వరుసగా మూడో టోర్నీల్లోనూ విఫలమైంది సింధు. ఇంతకుముందు కొరియా, చైనా ఓపెన్లలోనూ ప్రారంభ రౌండ్లలోనే వెనుదిరిగింది.
భారత ఆటగాడు సమీర్ వర్మ.. 12-21, 10-21 తేడాతో ఒలింపిక్ ఛాంపియన్ చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. థాయ్లాండ్ ఓపెన్లో విజేతగా నిలిచిన సాత్విక్-చిరాగ్ శెట్టి ద్వయం కూడా ఇంటి దారి పట్టింది. చైనా జోడీ హన్ చెంగ్ కై-జో హౌ డాంగ్ చేతిలో 16-21, 15-21 తేడాతో పరాజయం చెందారు.
ఇవీ చూడండి.. భారత్ మూడో టెస్టు కోసం సైనికులకు ఉచిత టికెట్లు