ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్స్ మినహా మిగతా టోర్నీల్లో పెద్దగా ఆక్టటుకోని భారత స్టార్ షట్లర్ పీవీ సింధు వైఫల్యాన్ని కొనసాగించింది. 'బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్'లో మహిళల సింగిల్స్ గ్రూప్-ఎ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సింధు.. యమగూచి చేతిలో ఓడింది.
68 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 21-18, 18-21, 8-21తో చేజేతులా ఓడిపోయింది సింధు. తొలి గేమ్ నెగ్గి.. రెండో గేమ్‌లో 15-11తో ఆధిక్యం సంపాదించిన ఈ షట్లర్.. విజయం సాధించడం లాంఛనమే అనిపించింది. ఐతే వరుసగా 5 పాయింట్లతో యమగూచి రేసులోకి వచ్చింది. సింధు పుంజుకున్నా పట్టువదలని యమగూచి.. వరుసగా 5 పాయింట్లు నెగ్గి 21-18తో రెండో గేమ్ గెల్చుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు పూర్తిగా తేలిపోయింది.
గురువారం చెన్ యుఫీ (చైనా)తో సింధు తలపడుతుంది.
ఇదీ చదవండి: కెప్టెన్సీ నుంచి రషీద్ ఖాన్ ఔట్... అఫ్గాన్‌కు బాధ్యతలు