ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో సత్తాచాటిన భారత షట్లర్ పీవీ సింధు చైనా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ విభాగంలో గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన చోచూవాంగ్ చేతిలో పరాజయం చెందింది.
21-12, 13-21, 19-21 తేడాతో ఓడింది. 50 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి పైచేయి సాధించింది. తొలి సెట్లో సులభంగా నెగ్గింది సింధు. అయితే అనంతరం పుంజుకున్న థాయ్‌లాండ్ ప్లేయర్ వరుస సెట్లలో తెలుగమ్మాయిని ఓడించింది.
హోరాహోరీగా సాగిన చివరి సెట్లో సింధు పోరాడినప్పటికీ ప్రత్యర్థినే విజయం వరించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో చైనాకు చెందిన లీ యూరేపై 21-18, 21-12 తేడాతో గెలిచింది సింధు.
ఇదీ చదవండి: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 'సాక్షి'కి నిరాశ