డెన్మార్క్‌లో అక్టోబర్ 9న ఆరంభమయ్యే థామస్, ఉబర్ కప్ ఫైనల్స్(thomas and uber cup finals) టోర్నీ కోసం భారత జట్టును ప్రకటించారు. పురుషుల, మహిళల జట్లకు సాయిప్రణీత్, సైనా నెహ్వాల్ సారథ్యం వహించనున్నారు. సైనాతో పాటు మాల్విక బన్సోద్, అదితి భట్, తస్నీమ్ మీర్ మహిళల బృందంలో చోటు దక్కింది. స్టార్ షట్లర్ పీవీ సింధుకు(Sindhu Thomas cup) విశ్రాంతి ఇచ్చారు.
పురుషుల జట్టులో ప్రణీత్‌తో పాటు కిదాంబి శ్రీకాంత్, కిరణ్ జార్జ్, సమీర్ వర్మ ఆడనున్నారు. ఫిన్లాండ్‌లో సెప్టెంబర్ 26న మొదలయ్యే సుదిర్మన్ కప్ కోసం కూడా 12 మంది సభ్యుల భారత బృందాన్ని ప్రకటించారు. సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. ఉబర్ కప్‌తో పాటు సుదిర్మన్ కప్‌లోనూ బరిలో దిగనున్నారు.
ఇదీ చూడండి: రితికతో రోహిత్ శర్మ లవ్.. యువరాజ్ వార్నింగ్!