ETV Bharat / sports

ఓర్లీన్​ మాస్టర్స్​: సైనా, శ్రీకాంత్​ శుభారంభం

పారిస్ వేదికగా జరుగుతున్న ఓర్లీన్ మాస్టర్స్​లో భారత షట్లర్లు అదిరిపోయే ఆరంభం అందించారు. మహిళల సింగిల్స్​లో సైనా.. పురుషుల సింగిల్స్​లో శ్రీకాంత్​ ఆకట్టుకునే ప్రదర్శన చేశారు.

Saina, Srikanth make winning starts in Orleans Masters
ఓర్లీన్​ మాస్టర్స్​: సైనా, శ్రీకాంత్​ శుభారంభం
author img

By

Published : Mar 24, 2021, 6:58 PM IST

పారిస్ వేదికగా జరుగుతున్న ఓర్లీన్​ మాస్టర్స్​ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్​ తొలి రౌండ్​లో సైనా నెహ్వాల్​.. ఐర్లాండ్​ ప్లేయర్​ రాచెల్​పై విజయం సాధించింది. కేవలం 21 నిమిషాల పాటు జరిగిన పోరులో 21-9, 21-5 తేడాతో ప్రత్యర్థిని వరుస సెట్లలో మట్టికరిపించింది సైనా.

టోక్యో ఒలింపిక్స్​కు అర్హత పొందాలంటే.. ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. రెండో రౌండ్​లో ఫ్రాన్స్ షట్లర్​ మేరీ బాటోమెన్​తో తలపడనుంది సైనా. వారం క్రితం జరిగిన ఆల్​ఇంగ్లాండ్​ ఓపెన్​లో తొడ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిందీ స్టార్ ప్లేయర్.

భారత పురుషుల సింగిల్స్​ మాజీ నెంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్​.. మరో భారత షట్లర్ అజయ్​ జయరామ్​పై గెలుపొందాడు. తొలి రౌండ్​లో బై సాధించిన శ్రీకాంత్​.. రెండో రౌండ్​లో 21-15, 21-10తో విజయం సాధించాడు. కాగా, అజయ్​ తన తొలి రౌండ్​లో సహచరుడు అలప్​ మిశ్రాను ఓడించాడు. 19-21, 23-21, 21-16 తేడాతో అలప్​ ఓటమి పాలయ్యాడు.

మిక్స్​డ్​ డబుల్స్​ విభాగంలో ఇండియా జంట ప్రణవ్​ జెర్రీ చోప్రా-సిక్కి రెడ్డి.. ఆస్ట్రియా జోడీ డొమినిక్ స్టిప్సిట్స్​-సెరెనా యోంగ్​పై విజయం సాధించింది. రెండు వరుస సెట్లలో 21-7, 21-18 తేడాతో గెలుపొందింది. తమ తదుపరి మ్యాచ్​లో డెన్మార్క్​కు చెందిన నిక్లాస్​ నోహ్ర్​-అమలై మాగెలండ్​తో పోటీ పడనుందీ భారత ద్వయం.

మహిళల సింగిల్స్​ మెయిన్ డ్రా నుంచి అర్హత పొందిన మరో భారత షట్లర్ ఇరా శర్మ​.. తొలి మ్యాచ్​లో అదరగొట్టింది. ఫ్రాన్స్​ క్రీడాకారిణి లియోనైస్​ హుయెట్​పై 12-21, 21-14, 21-17తో విజయం సాధించింది. తన తర్వాతి మ్యాచ్​లో బల్గేరియా ప్లేయర్​ మరియా మిత్సోవాతో బరిలోకి దిగనుంది.

ఇదీ చదవండి: ఇంగ్లాడ్​తో వన్డేలకు శ్రేయస్​ దూరం- ఐపీఎల్​కు డౌట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.