ETV Bharat / sports

శిక్షణా శిబిరానికి దూరంగా సైనా.. కారణమదే!

భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ భారత క్రీడా ప్రాధికార సంస్థ, భారత బ్యాడ్మింటన్ సంఘంపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన భర్త కశ్యప్​ను జాతీయ శిక్షణా శిబిరానికి ఎంపిక చేయకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.

శిక్షణ శిబిరానికి దూరంగా సైనా.. కారణమదే!

author img

By

Published : Aug 27, 2020, 9:39 AM IST

భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణా శిబిరానికి దూరంగా ఉంటోంది. ఈనెల 7న హైదరాబాద్‌లోని సాయ్‌-గోపీచంద్‌ అకాడమీలో 8 మంది ఒలింపిక్‌ ఆశావహులకు శిక్షణ ప్రారంభమైనా.. సైనా మాత్రం శిబిరంలో అడుగుపెట్టలేదు. తన భర్త కశ్యప్‌ను శిబిరానికి ఎంపిక చేయకపోవడమే సైనా అసంతృప్తికి కారణం.

శిక్షణా శిబిరానికి క్రీడాకారుల్ని ఎంపిక చేసిన భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌), భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌)లపై సైనా ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. శిబిరానికి ఎంపికైన 8 మందిలో సింధు, శ్రీకాంత్‌, సాయిప్రణీత్‌, సిక్కిరెడ్డి మాత్రమే గోపీచంద్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. సాత్విక్‌, చిరాగ్‌ వచ్చేనెలలో శిబిరంలో చేరే అవకాశముంది. అశ్విని ప్రస్తుతానికి బెంగళూరులోనే సాధన సాగిస్తోంది. సైనా, కశ్యప్‌ గోపీచంద్‌ అకాడమీకి సమీపంలోని కోర్టుల్లో కొందరు జాతీయ స్థాయి క్రీడాకారులతో కలిసి సాధన చేస్తున్నారు. కశ్యప్‌ను కూడా శిక్షణ శిబిరానికి అనుమతించాలని సైనా విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. శిబిరానికి తనను ఎంపిక చేయకపోవడాన్ని ప్రశ్నిస్తూ సాయ్‌, బాయ్‌లకు కశ్యప్‌ ఈమెయిల్‌లు రాశాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.