ETV Bharat / sports

డెన్మార్క్​ ఓపెన్​కు ​ దూరంగా సైనా, కశ్యప్ - Denmark Open Saina

భారత బ్యాడ్మింటన్​ స్టార్​ సైనా నెహ్వాల్​ డెన్మార్క్​ ఓపెన్​ నుంచి తప్పుకుంది. ఆమె భర్త పారుపల్లి కశ్యప్​ కూడా టోర్నీ నుంచి వైదొలిగాడు.

Saina, Kashyap
సైనా, కశ్యప్
author img

By

Published : Oct 6, 2020, 3:20 PM IST

Updated : Oct 6, 2020, 3:30 PM IST

భారత స్టార్​ బ్యాడ్మింటన్​ జోడీ సైనా నెహ్వాల్​, పారుపల్లి కశ్యప్​.. డెన్మార్క్​ ఓపెన్​ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించిందీ జంట. వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించనున్న ఆసియా పర్యటన నుంచి బరిలోకి దిగాలని​ నిర్ణయించుకున్నట్లు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైనా తెలిపింది. భార్యాభర్తలిద్దరూ ఇంతకుముందే ఈ టోర్నీ కోసం తమ ఎంట్రీలను పంపారు. సెప్టెంబరులో వారి సమ్మతి లేఖను బ్యాడ్మింటన్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా(బాయ్​)కు సమర్పించారు.

ఇప్పుడు ఉన్నట్లుండి తప్పుకోవడానికి ఫిట్​నెస్​ సమస్యల్లాంటి కారణాలేమైనా ఉన్నాయా అని అడగ్గా.. "గాయాలకు సంబంధించి ఎటువంటి సమస్య లేదు. ఒకవేళ మూడు టోర్నీలు నిర్వహించి ఉంటే బాగుండేది. ఇక నేరుగా జనవరిలో జరిగే ఆసియా పర్యటనతోనే సీజన్​ ప్రారంభిస్తా" అని సైనా స్పష్టం చేసింది.

అక్టోబరు 13న డెన్మార్క్​ ఓపెన్​ ప్రారంభం కానుంది. అదే నెల 18న చివరి మ్యాచ్​తో టోర్నీ ముగియనుంది.

Last Updated : Oct 6, 2020, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.