భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌తో పాటు ఒలింపిక్స్‌లో పతకం కోసం పోటీపడుతోన్న బ్యాడ్మింటన్ క్రీడాకారులు థాయ్‌లాండ్‌కు బయలుదేరారు. బ్యాక్ టూ బ్యాక్ టోర్నీల్లో పాల్గొనేందుకు వీరంతా సిద్ధమయ్యారు. సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సాత్విక్‌రాజ్, చిరాగ్ శెట్టి, అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి థాయ్‌లాండ్ వెళ్లిన వారిలో ఉన్నారు. ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు లండన్ నుంచి దోహా మీదుగా బ్యాంకాక్ చేరుకోనుంది.
శ్రీకాంత్ అక్టోబర్‌లో డెన్మార్క్ సూపర్-750లో పాల్గొనగా.. మిగతా వారంతా 10 నెలల తర్వాత తొలి టోర్నీలో పాల్గొనబోతున్నారు.
ప్రస్తుతం అందరి చూపూ యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్ (జనవరి 12-17), టయోటా థాయ్‌లాండ్ ఓపెన్ (జనవరి 19-24)పైనే ఉంది. కరోనా కారణంగా దాదాపు 10 నెలలు ఆటకు దూరంగా క్రీడాకారులు ఈ టోర్నీలతో ఫామ్‌లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు.
కాగా, ప్రణయ్, పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, ధృవ్ కపిల, మను అత్రి శనివారమే హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ బయల్దేరారు.