ETV Bharat / sports

థాయ్​లాండ్ ఓపెన్ నెగ్గిన సాత్విక్​-చిరాగ్​  జోడీ - chirag

థాయ్​లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ ఆటగాళ్లు రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి టైటిల్ నెగ్గారు. ఈ టోర్నీ గెలిచిన తొలి ఇండియన్ జోడీగా రికార్డు సృష్టించారు.

సాత్విక్ - చిరాగ్​
author img

By

Published : Aug 4, 2019, 3:37 PM IST

థాయ్​లాండ్ ఓపెన్​లో భారత పురుషుల డబుల్స్ జోడీ సత్తాచాటింది. సాత్విక్ రాంకీరెడ్డి - చిరాగ్ శెట్టి ద్వయం టైటిల్ నెగ్గింది. తుదిపోరులో చైనాకు చెందిన లీ జున్ హుయ్ - లీ యు చెన్​ను ఓడించి విజేతగా నిలిచింది. ఫలితంగా థాయ్​లాండ్ ఓపెన్ టైటిల్ గెలిచిన తొలి భారత జోడీగా రికార్డు సృష్టించింది.

చైనీస్ జోడీపై 21-19, 18-21, 21-18 తేడాతో విజయం సాధించింది సాత్విక్-చిరాగ్​ ద్వయం. సెమీస్​లో కొరియన్ ద్వయం కో సంగ్ - షిన్​పై గెలిచిన సాత్విక్ - చిరాగ్ జోడీ తుదిపోరులో శ్రమించాల్సి వచ్చింది.

నువ్వా నేనా అన్నట్లు సాగిన ఫైనల్ మ్యాచ్​ మూడు సెట్ల పాటు హోరాహోరీగా జరిగింది. చివరికి విజయం భారత ద్వయాన్నే వరించింది.

ఇది చదవండి: సచిన్​-కాంబ్లీ ఫ్రెండ్​షిప్​ డే థియరీ సూపర్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.