ETV Bharat / sports

అశ్విని - సాత్విక్ జోడీ రికార్డు విజయం - srikanth

థాయ్​లాండ్ ఓపెన్​లో భారత మిక్స్​డ్ డబుల్స్ జోడి అశ్విని పొన్నప్ప - సాత్విక్ ఒలింపిక్ పతక విజేతను ఓడించింది. పురుషుల సింగిల్స్​లో కిదాంబి శ్రీకాంత్ మలేసియా క్రీడాకారుడిపై గెలిచి రెండో రౌండ్​కు చేరుకున్నాడు.

షట్లర్లు
author img

By

Published : Jul 31, 2019, 3:48 PM IST

Updated : Jul 31, 2019, 4:12 PM IST

థాయ్​లాండ్​ ఓపెన్​లో భారత మిక్స్​డ్​ డబుల్స్​ జోడీ.. రికార్డు విజయాన్ని అందుకుంది. ఈ రోజు జరిగిన తొలి రౌండ్​లో ఒలింపిక్ పతక విజేతయిన చెన్ పెంగ్ సూన్​ - గో లియు ఇంగ్ ద్వయాన్ని అశ్విని పొన్నప్ప - సాత్విక్​ జోడి ఓడించింది.

గంటకు పైగా సాగిన ఈ మ్యాచ్​లో మలేసియాకు చెందిన ఐదో సీడ్ సూన్ - ఇంగ్ జోడిపై గెలిచింది అశ్విని - సాత్విక్ ద్వయం. 21-18, 18-21, 21-17 తేడాతో విజయం సాధించింది. మలేసియా జోడిపై గెలవడం వీరికిది రెండోసారి మాత్రమే. ఇంతకుముందు కామన్​వెల్త్​ క్రీడల్లో ఓడించారు.

ఐదో సీడ్ కిదాంబి శ్రీకాంత్ చైనాకు చెందిన రెన్ పెంగ్​పై విజయం సాధించి రెండో రౌండ్​కు చేరుకున్నాడు. 21-13, 17-21, 21-19 తేడాతో గెలుపొందాడు. రెండో రౌండ్​లో థాయ్​లాండ్ క్రీడాకారుడు హొసిట్ ఫెట్​ప్రదాబ్​తో పోటీ పడనున్నాడు.

మరో షట్లర్ సౌరభ్ చౌదరీ 21-23, 21-19, 5-21 తేడాతో జపాన్​కు చెందిన సునేయామా చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్​లో సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్​లోనే ఇంటిముఖం పట్టింది. చైనాకు చెందిన చెన్ జియో జిన్ చేతిలో 17-21, 7-21 తేడాతో పరాజయం పాలైంది.

ఇది చదవండి: జోఫ్రా జోస్యం మళ్లీ నిజమైంది..!

Intro:Body:

s

Conclusion:
Last Updated : Jul 31, 2019, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.