ETV Bharat / sports

సింధు షట్లర్​ కావడానికి కారణం ఆ వ్యక్తి! - PV Sindhu latest news

తాను బ్యాడ్మింటన్​ కోర్టులో ఉన్నప్పుడు ఎదుటివారిపై కాకుండా తన ఆటపై దృష్టి పెడతానని చెప్పింది పీవీ సింధు. ఈ ఆటను కెరీర్​గా ఎంచుకోవడానికి తన తండ్రే కారణమని తెలిపింది.

PV Sindhu reveals who inspired her to play sports
సింధు బ్యాడ్మింటన్ ఎంచుకోవడానికి ప్రేరణ అతనే!
author img

By

Published : Aug 30, 2020, 4:01 PM IST

బ్యా​డ్మింటన్​ బాగా ఆడేందుకు తన తండ్రి నుంచి లభించిన ప్రేరణే కారణమని ప్రముఖ షట్లర్​ పీవీ సింధు చెప్పింది. బ్యాంక్​ ఆఫ్​ బరోడా ఇన్​స్టా​ ఖాతా ద్వారా పలు అంశాల గురించి మాట్లాడింది. క్రీడలను ఎంచుకోవడానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నకు.. "నేను బ్యాడ్మింటన్​ను కెరీర్​గా ఎంచుకున్నప్పుడు నా తల్లిదండ్రులు అడ్డు చెప్పలేదు" అని తెలిపింది.

షట్లర్​ కాకపోయి ఉంటే మీరు ఏమయ్యేవారు అని అడగ్గా.. చిన్ననాటి నుంచి తాను డాక్టర్​ అయ్యేదానిని వెల్లడించింది. ప్రస్తుతం బ్యాడ్మింటన్​ కెరీర్​ బాగుందని తెలిపింది.

లాక్​డౌన్​లో కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదించడం సహా ఇంటి పనులు కూడా నేర్చుకున్నట్లు సింధు చెప్పింది. కరోనా వల్ల, భవిష్యత్​లో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్​లు ఆడేందుక ఆటగాళ్లందరూ సిద్ధంగా ఉండాలని సూచించింది. కోర్టులో ఉన్నప్పుడు తన గురించి, తనపై ఉన్న అంచనాలపై దృష్టి పెడతానని వెల్లడించింది. ప్రత్యర్థుల గురించి ఆలోచించడం వల్ల మనలో ఒత్తిడి పెరుగుతుందని తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.