36 ఏళ్ల తర్వాత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సెమీస్ చేరిన భారతీయుడిగా రికార్డు సొంతం చేసుకున్న సాయి ప్రణీత్ ఆ ఆనందాన్ని ఎంతోసేపు నిలుపుకోలేకపోయాడు. జపాన్ క్రీడాకారుడు డిఫెండింగ్ ఛాంపియన్ కెంటో మొమోటాపై ఓడి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
స్విట్జర్లాండ్ బాసెల్ వేదికగా జరిగిన సెమీస్‌లో 13-21, 8-21 తేడాతో వరుస సెట్లలో పరాజయం చవిచూశాడు ప్రణీత్. ప్రపంచ నెంబర్ వన్ మొమోటా కేవలం 41 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. అయితే ఓడినప్పటికీ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుని ప్రకాశ్ పదుకుణే సరసన చేరాడు ప్రణీత్.
తొలి సెట్లో 5-3తో శుభారంభం అందుకున్న ప్రణీత్ క్రమేపీ వెనకబడిపోయాడు. స్కోరు 11-10 వద్ద ఉండగా.. మొమోటా ప్రణీత్‌కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించి భారత షట్లర్‌ను ఓడించాడు.
ఇది చదవండి: ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు పీవీ సింధు