డచ్ ఓపెన్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ సత్తాచాటాడు. నెదర్లాండ్ అమెరే వేదికగా జరిగిన ఈ టోర్నీలో నెగ్గి కెరీర్లో బీడబ్ల్యూఎఫ్ తొలి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ విభాగం ఫైనల్లో జపాన్‌కు చెందిన యుసుకే ఒనుడెరాపై గెలిచాడు.
15-21, 21-14, 21-15 తేడాతో విజయం సాధించాడు లక్ష్యసేన్. 63 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఈ 18 ఏళ్ల భారత షట్లర్‌కు ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఫలితంగా తొలి సెట్లో పరాజయం పాలయ్యాడు.
అనంతరం పుంజుకున్న లక్ష్యసేన్.. తర్వాతి రెండు సెట్లలో నెగ్గి టైటిల్ కైవసం చేసుకున్నాడు. గత నెలలో జరిగిన బెల్జియన్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పొలిష్ ఓపెన్ ఫైనల్‌కు చేరాడు.
ఇదీ చదవండి: దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ.. మూడో టెస్టుకు కేశవ్ దూరం