ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ నుంచి ఇండోనేసియా బ్యాడ్మింటన్ బృందాన్ని తప్పించింది అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య. ఆ దేశ షట్లర్లు ప్రయాణం చేసిన విమానంలోని ఓ వ్యక్తికి కరోనా రావడమే ఇందుకు కారణం. దీంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచారు.
ఇండోనేసియా ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లోని క్వారంటైన్ నిబంధనల ప్రకారం విమానం దిగిన రోజు నుంచి 10 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉండాలి. దీంతో టోర్నీలో పాల్గొనడం వీలుకాదు. ఈ విషయాన్ని అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ధ్రువీకరించింది.