'ఇండోనేసియా మాస్టర్స్'లో డిఫెండింగ్ ఛాంపియన్, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో జపాన్‌కు చెందిన సయాకా తకాసి చేతిలో ఓడిపోయింది. ఈమెతో పాటే సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సౌరభ్ వర్మ.. టోర్నీ నుంచి నిష్క్రమించారు.
గతేడాది ఈ టోర్నీ విజేతగా నిలిచిన సైనా.. బుధవారం జరిగిన తొలిరౌండ్లో 19-21, 13-21, 5-21 తేడాతో పరాజయం పాలైంది. ఈ గేమ్ 50 నిమిషాల్లోనే ముగిసింది. గత వారం జరిగిన 'మలేసియా మాస్టర్స్' క్వార్టర్స్‌లో ఓడిపోయింది సైనా.
పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్.. 21-18, 12-21, 14-21 తేడాతో, సాయి ప్రణీత్.. 21-16, 18-21, 10-21 తేడాతో, సారభ్ వర్మ.. 21-17, 15-21, 10-21 తేడాతో ఓటమి పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్-సిక్కిరెడ్డి జోడీ.. దక్షిణా కొరియాకు చెందిన కో సంగ్-ఎమ్ హ్యవాన్ చేతిలో 8-21, 14-21 తేడాతో ఓడింది.
ఇది చదవండి: కోర్టులో నిర్వాహకులకు షాకిచ్చిన సైనా నెహ్వాల్