ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు సత్తా చాటారు. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, పారుపల్లి కశ్యప్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు క్వార్టర్స్‌కు చేరింది.
గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో సాయిప్రణీత్ 18-21, 21-16, 21-15 తేడాతో ఐదో సీడ్ సమీర్ వర్మను ఓడించాడు. మూడో సీడ్ శ్రీకాంత్ 21-11, 21-16 తేడాతో వరుస సెట్లలో లూ గ్వాంగ్జూ (చైనా)పై గెలుపొందగా, ప్రణయ్ 21-19, 20-22, 21-17 తేడాతో జాన్ జార్జెన్సన్ (డెన్మార్క్)ను ఓడించాడు. పారుపల్లి కశ్యప్ 21-11, 21-13 తేడాతో వరుస సెట్లలో తనోంగ్సక్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. నేడు జరగనున్న పురుషుల క్వార్టర్స్‌లో శ్రీకాంత్... సాయిప్రణీత్‌తో తలపడనున్నాడు.
- తిరుగులేని సింధు....
భారత స్టార్ క్రీడాకారిణి సింధు 21-11, 21-13 తేడాతో వరుస సెట్లలో డెంగ్ జాయ్ జువన్ (హాంకాంగ్)ను మట్టికరిపించింది. ఇప్పటికే ఓ సారి ఇండియా ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకున్న తెలుగమ్మాయి మరోసారి ట్రోఫీపై కన్నేసింది.
- డబుల్స్...
పురుషుల డబుల్స్‌లో మను అత్రి - సుమీత్ రెడ్డి, ప్రణవ్ చోప్రా - శివమ్ శర్మ జోడీలు.... మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి - అశ్విని పొన్నప్ప, అపర్ణ బాలన్ - శ్రుతి ద్వయం క్వార్టర్స్‌కు చేరింది.