ETV Bharat / sports

'త్వరలో బ్యాడ్మింటన్​ కోర్టులోకి అడుగుపెడతా'

కామన్​వెల్త్​ గేమ్స్​ స్వర్ణ విజేత జ్వాలా గుత్తా తిరిగి రాకెట్​ పట్టుకోనుంది. డబుల్స్​, మిక్స్డ్​ డబుల్స్​లో భారత్​కు ఎన్నో పతకాలు తెచ్చినపెట్టిన జ్వాలా.. తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టంచేసింది.

I will make a comeback soon: Jwala Gutta
త్వరలోనే బ్యాడ్మింటన్​ కోర్టులోకి జ్వాలా
author img

By

Published : Jan 16, 2021, 7:17 PM IST

బ్యాడ్మింటన్​ స్టార్​ గుత్తా జ్వాలా తిరిగి షటిల్​ కోర్టులో అడుగుపెట్టనుంది. ఆటకు ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని ఆమె స్పష్టంచేసింది. బిహార్​లోని మోతీహారిలో శుక్రవారం జరిగిన 'రన్​ ఫర్​ పీస్​' కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించింది.

జ్వాలా గుత్తా

"నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. కేవలం విరామం తీసుకున్నాను. త్వరలోనే బ్యాడ్మింటన్ కోర్టులో అడుగుపెడతా. ప్రతి క్రీడలో ప్రత్యేకించి మహిళలను ప్రోత్సాహించాలని అనుకుంటున్నాను. మన దేశంలో క్రీడలను అంత సీరియస్​గా తీసుకోం. వాటిని వృత్తిగా ఎంచుకునేలా చేయడానికి కృషి చేస్తా."

-గుత్తా జ్వాలా, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి

గతేడాది హైదరాబాద్​లో ఓ బ్యాడ్మింటన్​ అకాడమీని ఏర్పాటు చేసింది జ్వాలా. తన అకాడమీలో చేరుతున్న క్రీడాకారుల సంఖ్య పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి: బ్యాడ్మింటన్​​: టాప్​-10లో ఆరుగురు మనోళ్లే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.