ETV Bharat / sports

కరోనా దెబ్బకు హైదరాబాద్​ ఓపెన్​ రద్దు - Hyderabad Open badminton COVID-19 pandemic

కొవిడ్-19 ప్రభావంతో పలు క్రీడా పోటీలు నిలిచిపోయాయి. తాజాగా ఇదే తరహాలో హైదరాబాద్​ ఓపెన్​ టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా దెబ్బకు హైదరాబాద్​ ఓపెన్​ రద్దు
షట్లర్
author img

By

Published : Jun 4, 2020, 8:52 PM IST

ఈ ఏడాది ఆగస్టులో జరగాల్సిన హైదరాబాద్​ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ కరోనా దెబ్బకు రద్దయింది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాడ్మింటన్(బీడబ్ల్యూఎఫ్) సమాఖ్య స్పష్టం చేసింది.

షెడ్యూల్​ ప్రకారం ఆగస్టు11-16 మధ్య ఈ పోటీలు జరగాలి. కరోనా వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ టోర్నీని రద్దు చేశారు. బీడబ్ల్యూఎఫ్ వార్షిక క్యాలెండర్​పై దీని ప్రభావం పడనుంది. మిగతా వాటిలోనూ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్​ ఓపెన్​ రద్దయిన నేపథ్యంలో ఇప్పటికే వాయిదా పడ్డ జర్మన్ ఓపెన్(మార్చి 3-8), స్విస్ ఓపెన్(మార్చి 17-22), యూరోపియన్ ఓపెన్​లు(ఏప్రిల్ 21-26) జరిగేది సందేహంగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.