ETV Bharat / sports

'భారత షట్లర్లు ఆ లోపాన్ని సరిచేసుకోవాలి' - బీడబ్లుఎఫ్​ టోర్నీలను నిర్వహించకూడదన్న షట్లర్​ ప్రణీత్​

కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు బీడబ్ల్యూఎఫ్​ ఎటువంటి టోర్నీలు నిర్వహించకూడదని అభిప్రాయపడ్డాడు భారత షట్లర్​ సాయి ప్రణీత్​. దీంతో పాటు పలు విషయాల గురించి ఈటీవీ భారత్​ ఎక్స్​క్లూజివ్​ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

'భారత షట్లర్లు ఆ లోపాన్ని సరిచేసుకోవాలి'
భారత షట్లర్ సాయి ప్రణీత్
author img

By

Published : Jul 9, 2020, 2:56 PM IST

Updated : Jul 9, 2020, 5:02 PM IST

కరోనాకు వ్యాక్సిన్​ కనుగొనేంత వరకు అంతర్జాతీయ బ్యాడ్మింటన్​ సమాఖ్య ఎటువంటి టోర్నీలు నిర్వహించకూడదని ​సూచించాడు భారత్​ షట్లర్​ సాయి ప్రణీత్​. ప్రస్తుత పరిస్థితుల్లో బీడబ్ల్యూఎఫ్ అప్రమత్తంగా ఉండాలని అన్నాడు.

సాయి ప్రణీత్​

"బీడబ్ల్యూఎఫ్ ఈ క్లిష్ట పరిస్థితుల్లో​ ఎటువంటి టోర్నీలు నిర్వహించకూడదు. ప్రతి నిర్ణయం ఆచితుచి తీసుకోవాలి. అయినా ఒకవేళ షెడ్యూల్​ ప్రకారం టోర్నీలు పునఃప్రారంభించినా సజావుగా సాగడం అసాధ్యం. ఇది ఆటగాళ్లకు ఓ సవాల్​ లాంటిది. లాక్​డౌన్​ కారణంగా ఇంతకాలం ఇంటికే పరిమితమైన అథ్లెట్లు ఫిట్​నెస్​ కోల్పోయి ఉంటారు. మళ్లీ ఫామ్​లోకి రావాలంటే దాదాపు రెండు నెలల సమయం పడుతుంది."

sai praneeth
సాయి ప్రణీత్​

భారత ఆటగాళ్లకు నిలకడగా రాణించగలిగే సత్తా ఉందా?

భారీ ఈవెంట్లలో భారత షట్లర్లు నిలకడగా రాణించలేకపోతున్నారు. ఆ లోపాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే శిక్షణ పొందటానికి సౌకర్యాలు బాగానే ఉన్నాయి.

ఒలింపిక్స్​ వాయిదా వేయడం సమంజసమేనా?

నా దృష్టిలో టోక్యో ఒలింపిక్స్​ వాయిదా వేయడం మంచిదే. కానీ ఇది నాలుగేళ్లుగా శ్రమిస్తోన్న ఆటగాళ్లకు ఎదురుదెబ్బ లాంటిది. ఇందులో నేను కూడా బాధితుడినే. ప్రతిఒక్కరూ ఈ నిర్ణయంతో నిరాశ చెందారు. అయితే ఐఓసీ మాత్రం షెడ్యూల్​ ప్రకారం ఈ మెగాటోర్నీని నిర్వహించాలని యోచించింది. కానీ కరోనా నేపథ్యంలో కొన్ని దేశాలు తమ అథ్లెట్లను పంపించడానికి నిరాకరించడం వల్ల వెనక్కి తగ్గింది.

sindhu
పీవీ సింధు

ప్రస్తుతం బ్యాడ్మింటన్​కు సంబంధించిన సింగిల్స్​ ఈవెంట్​లో టోక్యో క్రీడలకు పీవీ సింధు, సాయి ప్రణీత్ అర్హత సాధించారు. సైనా నెహ్వాల్​, కిదాంబి శ్రీకాంత్ దాదాపు అర్హత పోటీల నుంచి వైదొలిగినట్లే.

ఇది చూడండి : 'ఎక్కడ తగ్గాలో తెలిసిన ఆటగాడు రోహిత్'

Last Updated : Jul 9, 2020, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.