ప్రముఖ షట్లర్ కరోలినా మారిన్.. చైనా ఓపెన్ విజేతగా నిలిచింది. దాదాపు ఎనిమిది నెలల అనంతరం బరిలోకి దిగిన ఈ షట్లర్.. మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో తై జు యింగ్(చైనీస్ తైపీ)పై 14-21, 21-17, 21-18 తేడాతో విజయం సాధించింది.
-
Highlights | Carolina Marin is overwhelmed with emotion as she makes a remarkable comeback to retain her crown 🏸#HSBCBWFbadminton #HSBCRaceToGuangzhou pic.twitter.com/CI9bcew1BT
— BWF (@bwfmedia) September 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Highlights | Carolina Marin is overwhelmed with emotion as she makes a remarkable comeback to retain her crown 🏸#HSBCBWFbadminton #HSBCRaceToGuangzhou pic.twitter.com/CI9bcew1BT
— BWF (@bwfmedia) September 22, 2019Highlights | Carolina Marin is overwhelmed with emotion as she makes a remarkable comeback to retain her crown 🏸#HSBCBWFbadminton #HSBCRaceToGuangzhou pic.twitter.com/CI9bcew1BT
— BWF (@bwfmedia) September 22, 2019
మోకాలి శస్త్రచికిత్స తర్వాత 8 నెలల విశ్రాంతి తీసుకున్న మారిన్... జనవరి తర్వాత మళ్లీ ఇప్పుడే రాకెట్ పట్టింది. వచ్చి రాగానే టైటిల్ గెలిచింది. ఇండోనేషియా మాస్టర్స్ ఫైనల్లో సైనాతో మ్యాచ్ సందర్భంగా గాయపడిందీ క్రీడాకారిణి. వియత్నాం ఓపెన్‌లోనూ బరిలోకి దిగిన ఈ స్టార్... సుపానిదా కేట్థాంగ్(థాయ్‌లాండ్) చేతిలో తొలి రౌండ్లోనే ఓడిపోయింది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతో సత్తాచాటిన భారత షట్లర్ పీవీ సింధు.. చైనా ఓపెన్‌లో నిరాశపరిచింది. ప్రీ క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన చోచూవాంగ్ చేతిలో 21-12, 13-21, 19-21 తేడాతో పరాజయం చెందింది.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కరోలినా బరిలోకి దిగలేదు. లేదంటే సింధు, కరోలినా మధ్య హోరాహోరీ పోరు ఉండేది. 2016 రియో ఒలింపిక్స్‌లో కరోలినా స్వర్ణం గెలవగా... ఫైనల్లో ఓడిన సింధు రజతంతో సరిపెట్టుకుంది.