ETV Bharat / sports

స్విస్​ ఓపెన్​: ఫైనల్​లో సింధుకు తప్పని ఓటమి - కరోలినా మారిన్​

స్విస్​ ఓపెన్ సింగిల్స్​ ఫైనల్​లో భారత షట్లర్​ పీవీ సింధు ఓటమి పాలైంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్​ తుదిపోరులో స్పెయిన్​ షట్లర్​ కరోలినా మారిన్​పై పరాజయం పొందింది.

Carolina Marin beat Sindhu in straight sets to win Swiss Open
స్విస్​ ఓపెన్​: ఫైనల్​లో సింధుకు తప్పని ఓటమి
author img

By

Published : Mar 7, 2021, 8:45 PM IST

స్విస్​ ఓపెన్​​ ఫైనల్​లో భారత షట్లర్​ పీవీ సింధు పరాజయం పొందింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్​ తుదిపోరులో స్పెయిన్​కు చెందిన కరోలినా మారిన్​పై 21-12, 21-5 తేడాతో ఓటమి పాలైంది.

  • YONEX Swiss Open 2021 (New Dates)
    WS - Final
    21 21 🇪🇸Carolina MARIN🏅
    12 5 🇮🇳V. Sindhu PUSARLA

    🕗 in 35 minutes
    https://t.co/jeacFDs1Mg

    — BWFScore (@BWFScore) March 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అంతర్జాతీయ టోర్నీల్లో పీవీ సింధు, కరోలినా మారిన్​ ఇప్పటివరకు 14 సార్లు తలపడ్డారు. రెండేళ్ల తర్వాత వారిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ ఇదే కావడం విశేషం. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్​.. బ్యాడ్మింటన్ సింగిల్స్​ ఫైనల్​లోనూ వీరిద్దరూ పోటీపడ్డారు. అయితే అందులో సింధు ఓటమి పాలై.. రజత పతకాన్ని దక్కించుకుంది.

2010లో మెక్సికో వేదికగా జరిగిన బీడబ్ల్యూఎఫ్​ ప్రపంచ జూనియర్​ ఛాంపియన్​షిప్​లో కూడా వీరిద్దరూ పోటీపడ్డారు. ఆ మ్యాచ్​లో మారిన్​పై 15 ఏళ్ల సింధు పైచేయి సాధించింది.

ఇదీ చూడండి: స్విస్​ ఓపెన్​: ఫైనల్​కు దూసుకెళ్లిన పీవీ సింధు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.