'బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్'లో అతికష్టం మీద చోటు దక్కించుకున్న భారత అగ్రశ్రేణి షట్లర్ పీవీ.సింధు. బుధవారం నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్వాంగ్జుకు చేరుకున్న షట్లర్లకు ఘనమైన ఆతిథ్యమిచ్చింది అక్కడి ప్రభుత్వం. టాప్-8 షట్లర్లు అంతా కలిసి ఆరంభ వేడుకలో సందడి చేశారు.
-
Ladies and Gentleman!
— BAI Media (@BAI_Media) December 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
The TOP 8 Women Single's shuttlers during the opening ceremony of the #BWFWorldTourFinals2019 in China including 2018 Champion @Pvsindhu1. All the best #pvsindhu. #IndiaontheRise#badminton#WorldTourFinals2019 pic.twitter.com/Y7nffpryEh
">Ladies and Gentleman!
— BAI Media (@BAI_Media) December 9, 2019
The TOP 8 Women Single's shuttlers during the opening ceremony of the #BWFWorldTourFinals2019 in China including 2018 Champion @Pvsindhu1. All the best #pvsindhu. #IndiaontheRise#badminton#WorldTourFinals2019 pic.twitter.com/Y7nffpryEhLadies and Gentleman!
— BAI Media (@BAI_Media) December 9, 2019
The TOP 8 Women Single's shuttlers during the opening ceremony of the #BWFWorldTourFinals2019 in China including 2018 Champion @Pvsindhu1. All the best #pvsindhu. #IndiaontheRise#badminton#WorldTourFinals2019 pic.twitter.com/Y7nffpryEh
మొదటి మ్యాచ్‌లోనే టాప్ ప్లేయర్ యమగూచి(జపాన్)తో తలపడనుంది సింధు. వీరిద్దరూ గతంలో 16 సార్లు పోటీపడగా.. 10 విజయాలు, 6 ఓటములు ఖాతాలో వేసుకుంది మన తెలుగమ్మాయి.
ఆరో సీడ్ సింధుతో పాటు చైనా షట్లర్లు చెన్ యుఫీ, హీ బింగ్జీవో, జపాన్ షట్లర్ యమగూచి గ్రూప్-ఏలో ఉన్నారు. గ్రూప్-బిలో ప్రపంచ నెంబర్ వన్ షట్లర్ తై జు యింగ్, మాజీ ఛాంపియన్ ఒకుహరతో పాటు థాయిలాండ్‌కు చెందిన బుసనన్ చోటు దక్కించుకున్నారు.
ఆశలన్నీ ఆమెపైనే...
ఈ ఏడాది బాసెల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన సింధు.. ఆ తర్వాత ఏ టోర్నీల్లోనూ విజేతగా నిలవలేకపోయింది. ఈ టోర్నీలో ఓపెనింగ్ మ్యాచ్‌ల్లో గెలిస్తే టైటిల్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రస్తుత మెగాటోర్నీలో సింధు టాప్-8లో లేకపోయినా.. ప్రపంచ ఛాంపియన్ అయినందుకు ఆమెకు అవకాశం లభించింది.
ప్రపంచ ఛాంపియన్షిప్ తర్వాత ఇండోనేషియా ఓపెన్ సూపర్ 750లో మత్రమే ఫైనల్ చేరింది. ఆ తర్వాత జరిగిన అన్ని టోర్నీల్లో ఆమె క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరకుండా, గ్రూప్ దశలోనే వెనుదిరిగింది.
ఈ బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్‌కు సింధు మినహా ఏ ఒక్క భారత షట్లర్ ఎంపికవ్వకపోవడం వల్ల ఈ తెలుగుతేజంపైనే ఆశలన్నీ ఉన్నాయి.