ETV Bharat / sports

HS Prannoy BWF: ప్రణయ్‌ సంచలన విజయం

author img

By

Published : Dec 14, 2021, 7:05 AM IST

BWF World Championships: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ అద్భుత విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్​లో 13-21, 21-18, 21-19తో ఎనిమిదో సీడ్‌ లాంగ్‌ అంగస్‌ను (హాంకాంగ్‌) ఓడించాడు.

BWF World Championships, ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ భారత షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ భారత షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌

BWF World Championships: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ సంచలన విజయం సాధించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో అన్‌సీడెడ్‌ ప్రణయ్‌ 13-21, 21-18, 21-19తో ఎనిమిదో సీడ్‌ లాంగ్‌ అంగస్‌ (హాంకాంగ్‌)కు షాకిచ్చాడు.

తొలి గేమ్‌ దక్కకపోయినా గొప్పగా పోరాడిన ప్రణయ్‌ వరుసగా రెండు గేమ్‌లు గెలిచి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. తొలి గేమ్‌ను 13-21తో చేజార్చుకున్న ప్రణయ్‌ రెండో గేమ్‌లో విజృంభించాడు. విరామ సమయానికి 11-3తో ఆధిక్యంలో నిలిచిన అతడు.. అదే జోరుతో 21-18తో గేమ్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. కానీ మూడో గేమ్‌లో లాంగ్‌ నుంచి ప్రణయ్‌కి ప్రతిఘటన ఎదురైంది. బ్రేక్‌ సమయానికి లాంగ్‌ 11-7తో ముందంజలో నిలిచాడు. కానీ పుంజుకున్న ప్రణయ్‌ 16-16తో స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత అదే ఊపులో 21-19తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. డబుల్స్‌లో పురుషుల విభాగం తొలి రౌండ్లో గౌరవ్‌ ప్రసాద్‌-దేవాంగన్‌ 8-21, 4-21తో మతియాస్‌-సురో (డెన్మార్క్‌) చేతిలో ఓడగా.. మరో మ్యాచ్‌లో అరుణ్‌ జార్జ్‌-సన్యామ్‌ శుక్లా 15-21, 14-21తో గ్జువాన్‌-జాంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం చవిచూశారు. మరో మ్యాచ్‌లో అర్జున్‌-ధ్రువ్‌ 21-18, 21-17తో డానియల్‌-మతియాస్‌ (డెన్మార్క్‌)పై గెలిచారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో ఉత్కర్ష్‌ అరోరా-కరిష్మా 20-22, 16-21తో ప్యాట్రిక్‌-ఫ్రాన్సిస్కా (జర్మనీ) చేతిలో ఓడారు.

ఇదీ చూడండి: అందుకే రోహిత్‌ని కెప్టెన్‌గా నియమించాం: గంగూలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.