భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు మరో గౌరవం దక్కింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) రాయబారుల బృందంలో చోటు లభించింది. ఈమెతో పాటు మిషెల్ లీ (కెనడా), జెంగ్ వీ, హావాంగ్ కియాంగ్ (చైనా), జాక్ షెపర్డ్ (ఇంగ్లాండ్), వలెస్కా నోబ్లాక్, మార్క్ జ్వీబ్లర్ (జర్మనీ), చాన్ యుయెన్ (హాంకాంగ్)లు రాయబారులుగా ఎంపికయ్యారు. వీరంతా 'ఐ యామ్ బ్యాడ్మింటన్' అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు.
"క్రీడాకారులు బ్యాడ్మింటన్ పట్ల ఇష్టాన్ని, గౌరవాన్ని వ్యక్తపరచేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తుంది. ప్రతి షట్లర్ నిజాయితీ, నిబద్ధతతో ఆడాలి. బ్యాడ్మింటన్ ఆడుతున్నందుకు సంతోషించాలి"
-పీవీ సింధు, భారత్ స్టార్ షట్లర్
బ్యాడ్మింటన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, డోపింగ్‌ల నిరోధంపై వర్ధమాన క్రీడాకారుల్లో అవగాహన కల్పించడం కోసమే "ఐ యామ్ బ్యాడ్మింటన్" ప్రచారం నిర్వహిస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది.
ఇదీ చూడండి : ఒకే మైదానంలో భారత్-ఆస్ట్రేలియా ఐదు టెస్టులు!