బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతమున్న మూడు గేమ్ (21x3)ల స్కోరింగ్ విధానాన్నే కొనసాగించనున్నారు. ఐదు గేమ్ (11x5)ల కొత్త విధానాన్ని ప్రతిపాదిస్తూ నిర్వహించిన ఓటింగ్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ రాలేదు.
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఓటింగ్‌ను నిర్వహించారు. మొత్తం 282 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 66.31 శాతం ఓట్లు ఐదు గేమ్‌ల విధానాన్ని ప్రతిపాదించిన అసోసియేషన్లకు వచ్చాయి. ఇందుకు వ్యతిరేకంగా 33.69 శాతం ఓట్లు ప్రస్తుత విధానానికి అనుకూలంగా ఉన్న అసోసియేషన్లకు పోలయ్యాయి. కొద్ది తేడాతో కొత్త విధానాన్ని అమలు చేసే అవకాశం దూరమైంది.
ఈ ఓటింగ్‌లో పాల్గొన్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అధ్యక్షుడు పౌల్ ఎరిక్ హోయర్. ఇండోనేసియా, కొరియా బ్యాడ్మింటన్ అసోసియేషన్లు కొత్త విధానాన్ని ప్రతిపాదించగా.. బ్యాడ్మింటన్ ఆసియా, కొరియా, తైపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్లు మద్దతు ప్రకటించాయి.
ఇదీ చదవండి: బ్యాడ్మింటన్ గేమ్‌లు మూడా.. ఐదా?