థాయ్‌లాండ్ ఓపెన్ ప్రారంభంలోనే భారత్‌కు షాక్ తగిలింది. ఆ టోర్నీలో పాల్గోనేందుకు బ్యాంకాక్ వెళ్లిన స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, హెఎస్ ప్రణయ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో మరిన్ని టెస్టుల కోసం వీరిద్దరిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చేసిన టెస్టులో ప్రణయ్‌కు నెగిటివ్‌గా తేలింది. కాగా, ఈరోజు సైనాతో మ్యాచ్ ఆడాల్సి ఉన్న మలేసియాకు చెందిన కిసోనా సెల్వదురాయ్కి వాకోవర్ లభించింది. ఫలితంగా ఆమె నేరుగా రెండో రౌండ్ ఆడనుంది.
సైనా భర్త, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ను కూడా ఆస్పత్రికి తరలించారు. కానీ ఇతడి కరోనా ఫలితం ఇంకా తెలియరాలేదు. వీరు ముగ్గురికి మరోసారి టెస్టు చేయనున్నారు.
ఇంతకుముందు జపాన్‌కు చెందిన కెంటో మొమొటా కూడా కరోనా బారినపడ్డాడు. దీంతో థాయ్‌లాండ్ టూర్ నుంచి తప్పుకుంది జపాన్ బృందం.