కొరియా ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లందరూ ఇంటిముఖం పడుతున్న వేళ.. పారుపల్లి కశ్యప్ మాత్రం ఒక్కో మెట్టు ఎక్కుతూ క్వార్టర్స్‌కు దూసుకొచ్చాడు. గురువారం పురుషుల సింగిల్స్‌లో మలేసియాకు చెందిన డారెన్ లివ్‌పై విజయం సాధించాడు.
21-17, 11-21, 21-17 తేడాతో నెగ్గి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. 56 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలిసెట్ సునాయాసంగా గెలిచిన కశ్యప్.. రెండో సెట్లో తడబడ్డాడు. ఫలితంగా ఆ గేమ్ చేజార్చుకున్నప్పటికీ మూడో సెట్లో ప్రత్యర్థిని బోల్తా కొట్టించి మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.
టోర్నీ ప్రారంభంలోనే సైనా, సింధు, సాయి ప్రణీత్ లాంటి స్టార్ షట్లర్లు వరుసగా ఇంటిముఖం పట్టారు. అయితే పారుపల్లి కశ్యప్ ఒక్కోమ్యాచ్ గెలుస్తూ సత్తాచాటుతున్నాడు. ఇంకో మ్యాచ్ నెగ్గితే పతకం ఖరారు చేసుకుంటాడు.
ఆంథోని(ఇండోనేసియా)- జేన్(డెన్మార్క్)ల్లో గెలిచిన వారితో తర్వాతి మ్యాచ్‌లో తలపడనున్నాడు పారుపల్లి కశ్యప్.
ఇదీ చదవండి: పాపులారిటీలో నరేంద్రుడి తర్వాత మహేంద్రుడే టాప్!