వారం విశ్రాంతి తర్వాత మళ్లీ బరిలోకి దిగుతున్నారు సైనా, పీవీ సింధు. 54 ఏళ్లుగా ఊరిస్తున్న ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలవాలని పట్టుదలతో ఉన్నారు. దీన్ని సాకారం చేసేందుకు నేటి నుంచి జరిగే మెయిన్ డ్రా మ్యాచ్‌ల్లో ప్రపంచస్థాయి ప్రత్యర్థులతో తలపడనున్నారు.
- ఖన్నా తర్వాత ఒక్కరూ లేరు...
1965లో భారత క్రీడాకారుడు దినేశ్ ఖన్నా... పురుషుల సింగిల్స్‌లో విజేతగా నిలిచిన తర్వాత ఇప్పటివరకు ఏ షట్లరు స్వర్ణం గెలవలేదు.
ఈ టోర్నీలో 2010, 2016లో సైనా, 2014లో సింధు కాంస్య పతకాలే సాధించారు. మహిళల సింగిల్స్ తొలిరౌండ్‌లో నాలుగో సీడ్ సింధు.. సయాక తకహాషి (జపాన్)తో పోటీపడనుంది. ఏడోసీడ్ సైనా.. హన్ యూ (చైనా)తో పోరుకు సిద్ధమైంది.
పురుషుల సింగిల్స్...
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో హిరెన్ రుస్తవితో (ఇండోనేసియా)తో కిదాంబి శ్రీకాంత్ పోటీకి సిద్ధమయ్యాడు. కాజుమా సకాయ్ (జపాన్)తో సమీర్ వర్మ తలపడనున్నాడు.
డబుల్స్..
మహిళల డబుల్స్‌లో తెలుగమ్మాయి జక్కంపూడి మేఘన అదృష్టం పరీక్షించుకోనుంది.
మిక్సెడ్ నిరాశ..
మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో రోహన్ కపూర్-కుహూ గార్గ్ జంట 5-21, 15-21తో ప్రవీణ్ -మెలాటి (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓటమిపాలైంది., సౌరభ్ శర్మ- పారిఖ్ జోడీ 9-21, 9-21తో డెచపోల్-సాప్‌సిరీ (థాయ్‌లాండ్) చేతిలో పరాజయం చెందారు.
-
@Utkarsharora_02 / #karishmawadkar and #venkatgauravprasad / #juhidewangan are through to the second round; both pairs had a walkover in their first round!!
— BAI Media (@BAI_Media) April 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
All the best guys for the upcoming matches!!💥💪🇮🇳#IndiaOnTheRise #Badminton pic.twitter.com/UpmkGvaGvr
">@Utkarsharora_02 / #karishmawadkar and #venkatgauravprasad / #juhidewangan are through to the second round; both pairs had a walkover in their first round!!
— BAI Media (@BAI_Media) April 23, 2019
All the best guys for the upcoming matches!!💥💪🇮🇳#IndiaOnTheRise #Badminton pic.twitter.com/UpmkGvaGvr@Utkarsharora_02 / #karishmawadkar and #venkatgauravprasad / #juhidewangan are through to the second round; both pairs had a walkover in their first round!!
— BAI Media (@BAI_Media) April 23, 2019
All the best guys for the upcoming matches!!💥💪🇮🇳#IndiaOnTheRise #Badminton pic.twitter.com/UpmkGvaGvr