పాన్ ఇండియా హీరోలను చూశాం.. పాన్ ఇండియా డైరక్టర్లనూ చూశాం. కానీ భాషలతో సంబంధం లేకుండా ఒక రచయిత పాన్ ఇండియా స్థాయికి చేరుకోవచ్చని.. అంతేకాదు.. అక్కడ రాణించ వచ్చని నిరూపించిన రచయిత విజయేంద్రప్రసాద్ (vijayendra prasad). 'బాహుబలి'తో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన డైరక్టర్ రాజమౌళి తండ్రి, ఆ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' (Alitho Saradaga) కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. 'సింహాద్రి' కథ వెనుక ఉన్న సీక్రెట్ గురించి వివరించారు. 'సింహాద్రి' మొదట ఎన్టీఆర్కే అనుకున్నారా? అని ఆలీ అడగ్గా ఆసక్తికర సమాధానమిచ్చారు.
"గోపాల్గారు మొదట 'సింహాద్రి' (Simhadri) కథను బాలకృష్ణకు చెప్పించారు. ఎందుకో అది బాలయ్య (Balakrishna)గారికి నచ్చలేదు. రాజమౌళి (rajamouli)కి ఆ కథ ఇష్టం" అని తెలిపారు. ఇంతలో ఆలీ కల్పించుకుని "సింహాద్రి రాజమౌళి చేయడం కంటే ముందు మరో ఇద్దరు దర్శకులు చేయడం, తప్పుకోవడం జరిగిందా?" అన్న ప్రశ్నకు అది ఈ కథ కాదని అన్నారు విజయేంద్ర ప్రసాద్. అలాగే 'సింహాద్రి' వెనకాల చిన్న కథ ఉందని తెలిపారు.
RRR: ఆ ఫైట్ ఏడిపిస్తుంది.. ఎందుకంటే?
"చెన్నైలో ఉన్న సమయంలో ఓ సినిమా చూస్తున్నా. నా పక్కన గణేశ్ అని అసోసియేట్ ఉన్నాడు. స్టోరీల్లో హెల్ప్ చేసేవాడు. ఆ సినిమా క్లైమాక్స్ చూస్తూ 'గణేశ్.. శ్రీదేవి అలా వెళ్లిపోతే కమల్ హాసన్‌కు గుండెల్లో గుచ్చినట్లు ఫీలింగ్ ఉంది కదా మనకు' అంటే 'ఔను సార్' అన్నాడు. 'ఓ పనిచేద్దామా గణేశ్.. దాన్ని ఓ కథ చేద్దామా' అంటే 'చేద్దాం సార్' అన్నాడు. 'కానీ నిజంగా గుండెల్లో గునపం పెట్టి గుచ్చాలి సార్ హీరోయిన్' అన్నాడు. 'అరె బుద్ధుందా అలా చేస్తే హీరో చచ్చిపోతాడు కదా' అన్నా. ఒక వారం పాటు అలానే గునపంతో గుండెల్లో గుచ్చాలి అని పట్టుబట్టాడు. సరే ఎందుకు గుచ్చాలి హీరోయిన్? దాని వెనక ఓ బలమైన కారణం ఉండాలి అని చెప్పి.. కథ దాని వెనకా ముందూ తయారైంది. అతను అలా ఆలోచించకపోతే ఆ కథ అలా పుట్టేది కాదు" అని వివరించారు విజయేంద్ర ప్రసాద్.
- " class="align-text-top noRightClick twitterSection" data="">