ETV Bharat / sitara

లిక్కర్​ పారబోస్తే.. ఐదేళ్ల వరకు తాగుడు బంద్​! - మద్యం ప్రియులు

సంతోషం వచ్చినా.. బాధ వచ్చినా.. సందర్భం ఏదైనా మద్యం ప్రియులు తాగుతూ ఎంజాయ్​ చేస్తారు. ఈ క్రమంలో మత్తులోనో.. అనుకోకుండానో ఒక్కోసారి గ్లాసు లేదా బాటిల్​ కింద పడుతుంది. అవసరమనుకుంటే.. మరొకటి కొనుక్కొని తాగుతారు. కానీ ఓ దేశంలో మాత్రం ఇలా పడేస్తే.. శిక్షిస్తారని మీకు తెలుసా..?

Victoria banned alcohol
మద్యం నిషేధం
author img

By

Published : Sep 15, 2021, 1:07 PM IST

మద్యం తాగేవారికి సందర్భంతో పని లేదు. ఎప్పుడూ తాగుతూ సరదాగా ఎంజాయ్​ చేస్తారు. ఈ నేపథ్యంలోనే కిక్​ ఎక్కువయ్యో.. పొరపాటునో మద్యం కింద పడేస్తారు లేకుంటే పారబోస్తారు. ఏముందలే అని మరొకటి కొని తాగుతారు. కానీ ఇలా చేస్తే ఐదేళ్లు వరకు మద్యం తాగకూడదనే నిబంధన ఉంది. ఇది మద్యం ప్రియులకు ఒక రకంగా శిక్ష లాంటిది. భయపడకండి.. ఈ నిబంధన మనం దేశంలో కాదులెండి.. విక్టోరియాలో ఉంది. అక్కడ విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంది. దీంతో మద్యం పడేస్తారని ఈ రూల్​ పెట్టారట.

ఈటీవీలో ప్రసారమయ్యే.. వినోదాన్ని విజ్ఞాన్ని పంచే కార్యక్రమంగా పేరున్న క్యాష్​ ప్రోగ్రామ్​లో ఈ ప్రశ్నను వ్యాఖ్యత సుమ అడిగారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన నటులు బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సమీర్​, రాజా రవీంద్ర హాస్యాస్పదంగా సమాధానాలిచ్చారు. ఈ ప్రశ్నకు బ్రహ్మాజీ.. సరిగ్గా బదులిచ్చారు. ఈ క్రమంలో మరిన్ని ప్రశ్నలు సంధించారు సుమ.

ప్రశ్న: మనిషి కళ్లు సుమారుగా ఎన్ని రంగులను చూడగలవు

  • జవాబు: 1 కోటి

ప్రశ్న: ఇండియాలో ఎంత వయసు వచ్చినవారు పింఛన్​​ తీసుకోవడానికి అర్హులు

  • జవాబు: 60 ఏళ్లు

ప్రశ్న: మగ పింగ్విన్​లు ఆడ పెంగ్విన్​లకు వేటిని బహుకరించి.. తమ ప్రేమను తెలియజేస్తాయి?

  • జవాబు: గులకరాళ్లు
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: బాహుబలిలో రమ్యకృష్ణ నటనను కృష్ణవంశీ మెచ్చుకోలేదట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.