Mahesh babu unstoppable: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'. ఇప్పటివరకు హీరోగానే మనకు పరిచయమున్న బాలయ్య.. తన వాక్చాతుర్యం, హాస్యంతో వచ్చిన గెస్ట్‌లను.. చూసే ప్రేక్షకుల మనసులు గెలిచారు. అయితే ఈ షో తొలి సీజన్ చివరికొచ్చేసింది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీనే వెల్లడించింది.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ఎపిసోడ్‌తో ఈ సీజన్‌ను ముగించనున్నట్లు తెలిపింది. త్వరలో ఆ ఎపిసోడ్ విడుదల తేదీని వెల్లడిస్తామని పేర్కొంది.
Unstoppable with nbk guests: ఇప్పటివరకు ఈ షోకు వరుసగా మోహన్‌బాబు అండ్ ఫ్యామిలీ, నాని, బ్రహ్మానందం-అనిల్ రావిపూడి, 'అఖండ' టీమ్, రాజమౌళి వచ్చారు. వీళ్లకు సంబంధించిన ఎపిసోడ్స్.. ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీళ్ల తర్వాత అల్లు అర్జున్, రవితేజ-గోపీచంద్ మలినేని రానున్నారు.
అయితే 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'-మహేశ్‌బాబు ఎపిసోడ్.. సంక్రాంతి కానుకగా అభిమానుల ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు', బాలయ్య 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'.. ఇలా రెండు షోలకు చివరి గెస్ట్ మహేశ్‌బాబు కావడం మరో విశేషం.
Mahesh babu sarkaru vaari paata: ప్రస్తుతం మహేశ్‌బాబు 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. ఇందులో కీర్తి సురేశ్ హీరోయిన్. పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇవీ చదవండి: