ETV Bharat / sitara

బాలయ్యతో మహేశ్.. అన్​లిమిటెడ్ పంచ్​లు! - మహేశ్​బాబు అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే

Unstoppable with NBK Latest promo: బాలయ్య టాక్​ షోలో మహేశ్​బాబు పాల్గొన్న ఎపిసోడ్​ ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందా? అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ ఆత్రుతకు తెర దించడానికి ప్రోమో వచ్చేసింది. ఈ ఎపిసోడ్ ప్రీమియర్ డేట్ కూడా ప్రకటించారు.

Unstoppable with NBK latest promo
Unstoppable with NBK latest promo
author img

By

Published : Jan 21, 2022, 8:31 PM IST

Unstoppable with NBK Latest promo: 'అఖండ' సినిమాతో థియేటర్ల దగ్గర దుమ్ములేపుతున్న బాలయ్య.. మరోవైపు ఓటీటీలోనూ అదరగొడుతున్నారు. 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' టాక్​ షోతో అభిమానుల్ని అలరిస్తున్నారు.

ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ షోల్ సందడి చేయగా.. తాజాగా సూపర్​స్టార్ మహేశ్​బాబు ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. దీంతో అటు బాలయ్య, ఇటు మహేశ్​ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇటీవల ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' టాక్​ షోలో పాల్గొన్న మహేశ్​బాబు.. తనదైన మార్క్ టైమింగ్​తో అలరించారు. ఆ ఎపిసోడ్​ అభిమానులకు కనువిందు చేసింది. ఇలా రోజుల వ్యవధిలో బాబాయ్, అబ్బాయితో కలిసి మహేశ్​ సందడి చేశారు. తాజాగా అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే షోలో పాల్గొన్నారు. ఈ సీజన్​కు ఇదే చివరి ఎపిసోడ్​ కావడం విశేషం. పూర్తి ఎపిసోడ్ ఫిబ్రవరి 4న ప్రసారం కానుంది. అంతవరకు ప్రోమో చూసి పండగా చేసుకోండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మహేశ్​ నటించిన 'సర్కారు వారి పాట' షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. బ్యాంక్​ రుణాల ఎగవేత నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్​గా చేస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Unstoppable with NBK latest promo
సర్కారు వారి పాట

ఇదీ చూడండి: 'అల వైకుంఠపురములో' హిందీ రిలీజ్ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.