ETV Bharat / sitara

బుల్లితెర నటి బలవన్మరణం.. కారణమేంటి? - Preksha Mehta news

టీవీ నటి ప్రేక్షా మెహతా మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు ఈ చర్యకు పాల్పడింది అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బుల్లితెర నటి బలవన్మరణం.. కారణమేంటి?
టీవీ నటి ప్రేక్షా మెహతా
author img

By

Published : May 27, 2020, 9:33 AM IST

బుల్లితెర నటి ప్రేక్షా మెహతా (25) ఆత్మహత్య చేసుకుంది. లాక్‌డౌన్​తో షూటింగ్స్‌ లేకపోవడం వల్ల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఈమె.. తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం ఎంతసేపటికీ బయటకు రాకపోవడం వల్ల ప్రేక్షా గదిలోకి వెళ్లిన ఆమె తండ్రి, ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విగతజీవిగా ఉన్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న హీరానగర్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

TV actor Preksha Mehta
టీవీ నటి ప్రేక్షా మెహతా

ఈ విషయంపై హీరా నగర్‌ పోలీస్‌ అధికారి రాజీవ్‌ మాట్లాడుతూ.. 'బుల్లితెర నటి ప్రేక్షా మెహతా లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి ఇండోర్‌లోనే కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు గురించి దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే వివరాలను వెల్లడిస్తాం' అని తెలిపారు.

ప్రేక్షామెహతా సోమవారం రాత్రి పెట్టిన ఓ ఇన్‌స్టా పోస్ట్‌ చర్చనీయాంశమైంది. 'కలలు చనిపోవడమే మన జీవితంలో చెత్త విషయం' అంటూ ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడం వల్ల ప్రేక్షా తీవ్ర మనోవేదనకు గురయ్యారా? అని అందరూ చర్చించుకుంటున్నారు. 'క్రైమ్‌ పెట్రోల్‌', 'లాల్‌ ఇష్క్‌', 'మేరీ దుర్గ' సీరియల్స్‌లో నటించిన ఆమె ప్రేక్షకులను అలరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.